తెలంగాణలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు వచ్చే సంవత్సరం మార్చి 18 నుంచి ప్రారంభం కానున్నట్లు పాఠశాల విద్యాశాఖ వర్గాలు సూచిస్తున్నాయి.
Google AI Tools: ఒకప్పుడు విద్య అంటే పుస్తకాల పేజీలను తిప్పుకుంటూ చదవడం, చేతితో నోట్లు రాయడం, అర్థం కాకపోయినా కంఠస్థం చేసుకోవడం అనే కఠినమైన ప్రక్రియగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ కాలం మారిపోయింది. కృత్రిమ మేధస్సు (AI) రావడంతో విద్యా ప్రపంచం పూర్తిగా కొత్త దిశలో పయనిస్తోంది. విద్యార్థులు ఇప్పుడు కేవలం కష్టపడడం కాకుండా, తెలివిగా నేర్చుకునే మార్గాలను అవలంబిస్తున్నారు. విద్యార్థులందరికీ గూగుల్ అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు వస్తోంది. సంస్థ…
Students Carry Tent Equipment: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు.. మలికిపురం మండలం బట్టేలంక హై స్కూల్‌లో చోటుచేసుకున్న సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ఒక రోజు ఆటల పోటీలు నిర్వహించే క్రమంలో, స్కూల్ టీచర్లు విద్యార్థుల చేత టెంట్ సామాన్లు మోయించారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. Read Also: New York Mayor Elections: ట్రంప్‌కు భారీ…
HM Suspended: విద్యార్ధులతో కాళ్లు పట్టించుకున్న ప్రధానోపాధ్యాయురాలిపై వేటు వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కాగా, శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో హెచ్‌ఎంగా పనిచేస్తున్న సుజాత వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. ఉపాధ్యాయురాలు ఎంతో హుందాగా సెల్ ఫోన్‌లో మాట్లాడుతూ కుర్చీలో కూర్చిని ఉండగా.. ఇద్దరు విద్యార్థినులు ఆ హెచ్‌ఎం కాళ్లు నొక్కుతున్నారు. ఈ చిత్రాన్ని చూసిన జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఆమెపై…
తరగతి గదుల్లో చదువుకోవాల్సిన విద్యార్థులు కూలీలుగా మారారు. విద్యార్థులతోనే బెంచీలను తరలించారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. నిధులు లేవని విద్యార్థులను ప్రమాదంలోకి నెట్టేశారు ఉపాధ్యాయులు. పురానిపేట ప్రభుత్వ పాఠశాల లో బెంచీలా కోసం కూలీలుగా మారారు విద్యార్థులు. పురానిపేట ప్రభుత్వ పాఠశాల నుండి సుమారు 10 కిలోమీటర్ల దూరం ఉన్న జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల ప్రభుత్వ పాఠశాల నుండి విద్యార్థులే కూలీలై బెంచీలను తరలించారు. Also Read:Tejashwi Yadav: ఆ పరిస్థితి వస్తే…
రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ (యూఎస్సీ) నిధుల కోసం ఆందోళన చేస్తున్న ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, ప్రభుత్వంతో జరిగిన చర్చల అనంతరం తమ బంద్‌ను విరమించుకున్నాయి.
Balakrishna: ప్రముఖ సినీ నటుడు, శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ ముంబైలోని వాడాలాలో ఉన్న ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్‌ను సందర్శించి, విద్యార్థులతో ముచ్చటించారు. గత 77 సంవత్సరాలుగా తెలుగు సమాజానికి విద్యా సేవలు అందిస్తున్న ఈ సంస్థ, తన గొప్ప చరిత్రతో విద్యా రంగంలో విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. నర్సరీ నుండి 12వ తరగతి వరకు విద్యను అందిస్తున్న ఈ పాఠశాలలో సుమారు 4,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. 150 మంది అధ్యాపకులు, సిబ్బంది వీరికి…
ఇటీవల గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతుండడంతో ఆందోళన నెలకొంది. తమ పిల్లలకు ఎప్పుడు ఏమవుతుందో అని భయాందోళనకు గురవుతున్నారు తల్లిదండ్రులు. ఇప్పుడు మరో ఘటన చోటుచేసుకుంది. అయితే ఇది ఫుడ్ పాయిజన్ వల్ల మాత్రం కాదు. స్కూల్ ఆవరణలో దోమల మందు పిచికారీ చేయడంతో మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం చందనపూర్ గ్రామంలోని బాలుర గురుకుల పాఠశాలలో 16 మంది విద్యార్థుల అస్వస్థతకు గురయ్యారు. Also Read:Kovvur Midnight Clash: కొవ్వూరులో…
తల్లికి వందనం పథకంపై శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏపీలో తల్లికి వందనం పథకం పెండింగ్ దరఖాస్తులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆమోదం తెలిపారు.. విద్యా శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించిన లోకేష్.. పథకానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న రూ.325 కోట్లు రిలీజ్ కు అనుమతి ఇచ్చారు.. దీంతో, త్వరలోనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకానికి సంబంధించిన సొమ్ము జమకానుంది.
డీఎస్సీపై కీలక ప్రకటన చేశారు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. ఇకపై ప్రతి ఏటా ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తాం అన్నారు.. ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహిస్తాం అన్నారు.. ఉపాధ్యాయులపై అనవసరమైన ఒత్తిడి లేకుండా చర్యలు తీసుకుంటాం అన్నారు లోకేష్... ఇప్పటికే 16,347 పోస్టులతో డీఎస్సీ నిర్వహించామన్నారు లోకేష్... అనవసర శిక్షణ కార్యక్రమాలతో ఉపాధ్యాయుల సమయం వృథా చేయొద్దని అధికారులకు సూచించారు మంత్రి లోకేష్.. అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు.. విద్యా శాఖ…