TS Inter Hall Tickets: తెలంగాణ ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండిలా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు ఈరోజు విడుదలయ్యాయి. వాటిని ఇంటర్మీడియట్ బోర్డు ఆన్ లైన్ లో విడుదల చేసింది. కాగా.. ఇంతకుముందు కళాశాలల ప్రిన్సిపాళ్ల లాగిన్ ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడ్ కు అవకాశం ఉండేది. కానీ తాజాగా.. విద్యార్థులే నేరుగా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశాశ్ని కల్పించింది. అయితే.. అధికారిక వెబ్ సైట్ tsbie.cgg.gov.in నుంచి విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు జరుగనున్నాయి. ఈ సంవత్సరంలో 9.8 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారని బోర్డు తెలిపింది.
Read Also: Harish Rao: ఆర్టీసీ విలీనానికి సంబంధించిన ‘అపాయింటెడ్ డే’ ప్రకటించలేదు..
Also Read
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
- PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండిలా..!
1. TSBIE అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in ను సందర్శించండి.
2. ఆ తర్వాత హోమ్‌పేజీలో తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ లేదా సెకండియర్ హాల్ టికెట్ కోసం లింక్‌పై క్లిక్ చేయండి.
3. లాగిన్ పేజీలో టీఎస్ ఇంటర్ ప్రథమ లేదా ద్వితీయ సంవత్సరం హాల్ టికెట్ కోసం రోల్ నంబర్ లేదా మునుపటి సంవత్సరం హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయండి.
4. ఆ తర్వాత హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది. డౌన్‌లోడ్ చేసుకోండి.
Read Also: YSRCP: సీఎం జగన్ అధ్యక్షతన ఈ నెల 27న వైసీపీ కీలక సమావేశం
పరీక్ష తేదీలు
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఫిబ్రవరి 28న ప్రారంభమై మార్చి 18 వరకు జరుగుతాయి. సెకండియర్ పరీక్షలు ఫిబ్రవరి 29న ప్రారంభమై మార్చి 19 వరకు జరుగుతాయి. అయితే ఈ పరీక్షలను ఒకే షిఫ్ట్‌లో నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల షెడ్యూల్
28-02-2024 – సెకండ్ లాంగ్వేజ్ పేపర్-I
01-03-2024 – ఇంగ్లీష్ పేపర్-I
04-03-2024 – గణితం పేపర్-IA / బోటనీ పేపర్-I / పొలిటికల్ సైన్స్ పేపర్-I
06-03-2024 – మ్యాథమెటిక్స్ పేపర్-IB / జువాలజీ పేపర్-I / హిస్టరీ పేపర్-I
11-03-2024 – ఫిజిక్స్ పేపర్-I / ఎకనామిక్స్ పేపర్-I
13-03-2024 – కెమిస్ట్రీ పేపర్-I / కామర్స్ పేపర్-I
15-03-2024 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-I / బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్-I
18-03-2024 – మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-I / జియోగ్రఫీ పేపర్-I
ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్
29-02-2024 – సెకండ్ లాంగ్వేజ్ పేపర్-II
02-03-2024 – ఇంగ్లీష్ పేపర్-II
05-03-2024 – గణితం పేపర్-IIA / బోటనీ పేపర్-II / పొలిటికల్ సైన్స్ పేపర్-II
07-03-2024 – మ్యాథమెటిక్స్ పేపర్-IIB / జువాలజీ పేపర్-II / హిస్టరీ పేపర్-II
12-03-2024 – ఫిజిక్స్ పేపర్-II / ఎకనామిక్స్ పేపర్-II
14-03-2024 – కెమిస్ట్రీ పేపర్-II / కామర్స్ పేపర్-II
16-03-2024 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-II / బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్-II
19-03-2024 – మోడరన్ లాంగ్వేజ్ పేపర్-II / జియోగ్రఫీ పేపర్-II
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
-
Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
-
Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!