ఇద్దరు విద్యార్థులు క్లాస్ రూంలో కొట్టుకునే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఇద్దరు స్టూడెంట్స్ క్లాస్ రూమ్‌లో గొడవ పడుతున్నారు. అయితే వారిద్దరూ సీటు కోసం గొడవ పడుతుండటంలా అనిపించింది. ఈ ఫైట్ కి సంబంధించిన వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. ఇద్దరు విద్యార్థులు సీటుకోసం ఒకరినొకరు దారుణంగా కొట్టుకున్నారు.
కాకినాడ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. నలుగురు యువకులు గోదావరిలో గల్లంతు అయ్యారు. తాళ్లరేవు మండలం గోపలంక దగ్గర ఈ ఘటన జరిగింది. తణుకు పరిధిలోని సజ్జాపురంకు చెందిన 8 మంది విహారయాత్రకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఏపీలో స్కూల్స్, కాలేజీలకు జగన్ సర్కార్ దసరా సెలవులను ఖరారు చేసింది. ఏపీలో 13 రోజులు సెలవులు ఇచ్చాయి. అక్టోబరు 13వ తారీఖు నుంచి దసరా సెలవులను ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అక్టోబర్ 25 వరకు ఈ సెలవులు ఉంటాయి.
Andhra Pradesh: నేటి బాలలే రేపటి పౌరులు. అలాంటి బాలలను తీర్చిదిద్ది పౌరులుగా మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులది. ప్రభుత్వం సహకరిస్తే ఉపాధ్యాయులు తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదని.. విద్యార్థుల భవిష్యత్తుకి బంగారు బాటలు వేసి ఖండాలు దాటించగలరని నిరూపించారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ లోపల అడుగుపెట్టారు. వివరాలలోకి వెళ్తే రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి అంతర్జాతీయ వేదికపై వివరించేందుకు రాష్ట్రంలో సంక్షేమ పథకాల నుండి…
Punjab Students Parents worry about Study in Canada after India-Canada Issue: భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేయడమే ఇందుకు కారణం. ఈ ఆరోపణల తర్వాత ఇరు దేశాలు ప్రయాణ హెచ్చరికలు జారీ చేశాయి. అంతేకాదు ఇరు దేశాలు దౌత్య వేత్తలను కూడా బహిష్కరించాయి. కెనడా వీసాలను…
ఒడిశాలో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. రాజధాని భువనేశ్వర్‌లోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ ఫుడ్‌లో చనిపోయిన కప్ప దర్శనమిచ్చింది. ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు వడ్డించిన ఆహారంలో చనిపోయిన కప్ప కనిపించడంతో విద్యార్థులు కంగుతిన్నారు.
Mysore: చినుకు చినుకు కలిసి గాలి వానగ మారినట్టు. ఇద్దరు విద్యార్థుల మధ్య చెలరేగిన గొడవ ఓ విద్యార్థి ప్రాణాలను బలితీసుకుంది. కాలేజీకి వెళ్లి చదువుకుని ఉద్ధరిస్తారు అని కాలేజికి పంపిన తల్లిదండ్రులకు తీరని శోఖం మిగిలింది. ఒకరికి కన్న కొడుకు శాశ్వతంగా దూరమై తీరని దుఃఖాన్ని మిగిల్చాడు. మరొకరికి కన్న కొడుకు హంతకుడిగా మారి వేదన పాలు చేసాడు. ఈ హృదయ విదారక ఘటన మైసూరులో చోటు చేసుకుంది. Read also:India-China: భారత ఆటగాళ్లకు అనుమతివ్వని…