HCA invites Students to watch IND vs ENG Test for free at Uppal Stadium: జనవరి 11 నుంచి అఫ్గానిస్థాన్‌తో భారత్ టీ20 సిరీస్ ఆడనుంది. అనంతరం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జనవరి 25న తొలి టెస్ట్ మ్యాచ్ ఆరంభమవుతుంది. ఈ టెస్టు మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ మ్యాచ్‌ను విద్యార్థులు ఉచితంగా చూసే అవకాశంను హెచ్‌సీఏ కల్పిస్తోంది.
Also Read: IND vs AUS: మూడో టీ20లో భారత్ పరాజయం.. ఆస్ట్రేలియాదే టీ20 సిరీస్!
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో 6-12 తరగతులకు చెందిన విద్యార్థులు ఉచితంగా భారత్, ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్‌ను వీక్షించొచ్చని హెచ్‌సీఏ తెలిపింది. మ్యాచ్‌ను చూడాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా వారి స్కూల్ యూనిఫామ్‌లో స్టేడియానికి రావాలి. స్టేడియానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ హెచ్‌సీఏ ఉచిత భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసింది. జనవరి 18లోగా ఆసక్తి ఉన్న స్కూల్ యాజమాన్యాలు హెచ్‌సీఏ సీఈవోకు ceo.hydca@gmail.com మెయిల్ చేయాల్సి ఉంటుంది. లేదా స్టేడియంలో తెలియజేయాలని హెచ్‌సీఏ తెలిపింది.