ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 10 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థి బృందం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 2 వారాల పాటు పర్యటించారు. (సెప్టెంబర్ 15 - 28) మధ్య పర్యటిస్తుండటం ఇదే మొదటిసారి. ఐక్యరాజ్య సమితిలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ విద్యార్థులు వెళ్లగా.. అమెరికా అధికారులు, వరల్డ్ బ్యాంక్, US డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్, కొలంబియా యూనివర్సిటీ, వాషింగ్టన్ DCలోని వైట్ హౌస్‌ను సందర్శించాల్సిందిగా ఆహ్వానించారు.
బీహార్‌లోని వైశాలిలో విద్యార్థినుల ఉగ్రరూపం కనిపించింది. మహ్నార్ బాలికల ఉన్నత పాఠశాలలో తరగతిలో కూర్చోవడానికి స్థలం లేదని విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. అంతేకాకుండా.. బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (BEO) వాహనంపై విద్యార్థినులు రాళ్లు రువ్వారు.
వైసీపీ ప్రభుత్వంపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెనాలిలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల నుండి 3,82,000 మంది విద్యార్థులు డ్రాప్ ఔట్ అయ్యారని తెలిపారు. విద్యార్థుల అంశంలో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని.. దీనికి కారణాలు ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని ఆయన అన్నారు.
చెప్పకుండా బయటకు వెళ్లడమే ఆ విద్యార్థులు చేసిన నేరం. అందుకు స్కూల్ ప్రిన్సిపల్ వారిని కర్రతో వాతలొచ్చే వరకు చితకబాదాడు. ఈ ఘటన మంగళవారం జార్ఖండ్‌లోని పాలములోని సత్బర్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని భోగు గ్రామంలో జరిగింది.
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోని ఓ ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయిన ఘటన వెలుగు చూసింది. ఉమ్డి గ్రామంలోని ఆశ్రమ పాఠశాలలో 160 మందికి పైగా విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవడంతో ఆస్పత్రి పాలయ్యారు.
కోటా విద్యా కేంద్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు అరికట్టడానికి నివారణ చర్యలు చేపట్టింది. కోటాలో అన్ని హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్ (పీజీ) నివాసాల్లో స్ప్రింగ్లోడెడ్ ఫ్యాన్లను ఏర్పాటు చేశారు.
సాధారణంగా విద్యాసంస్థల్లో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్, టీజింగ్ చేస్తారు. ఇక సినిమాల్లో అయితే విద్యార్థులు టీచర్ను ర్యాగింగ్, టీజింగ్ చేసే సీన్స్ పెడతారు.
ఒడిశాలో వర్షంతో పాటు పిడుగులు బీభత్సం సృష్టించాయి. కేంద్రపరా జిల్లాలోని ఓ పాఠశాలపై పిడుగు పడింది. ఈ పిడుగుపాటుకు 16 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.