TS Entermediate Exam: రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు.. ప్రతీ కేంద్రంలోనూ సీసీ కెమెరాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Entermediate Exam: ఇంటర్ విద్యార్థులకు పరీక్ష రాసేందుకు సమయం రానే వచ్చింది. రేపటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అధికారులు ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే రెండు దశల్లో ప్రాక్టికల్స్, పర్యావరణ విద్య పరీక్షలు కూడా పూర్తయ్యాయి. ఇక వార్షిక పరీక్షలు మార్చి 28 నుంచి 19 వరకు నిర్వహించనున్నారు. జిల్లాలోని 58 కళాశాలల్లో 16 ప్రభుత్వ కళాశాలలు కాగా, 18 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. మిగిలినవి కస్తూర్బా, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, మైనారిటీ కళాశాలలు.
ఇందులో 13,175 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 6,507 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 6,668 మంది ఉన్నారు. ఈ పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 30 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, ప్రభుత్వ రంగ మోడల్ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, గిరిజన గురుకుల పాఠశాలల్లో సీసీ కెమెరాలతో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్‌తో పాటు డిపార్ట్‌మెంటల్ అధికారిని నియమించారు.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
Read also: Congress Schemes: గుడ్ న్యూస్.. నేటి నుంచే విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాల ప్రారంభం
ఈ పరీక్షల కోసం దాదాపు 700 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. సీసీ కెమెరాల నిఘాలో ప్రత్యేక అధికారులు పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందు ప్రశ్నపత్రాలను విడుదల చేస్తారు. ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్, నాలుగు సిట్టింగ్ స్క్వాడ్ టీమ్‌లు, 5 కస్టోడియన్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పరీక్షా కేంద్రాల దగ్గర ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలని పోలీసు శాఖ ఆదేశించింది. పరీక్షలు ఈ నెల 28న ప్రారంభమై మార్చి 19న ముగుస్తాయి. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. ఉదయం 8 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. ఉదయం 9 గంటల తర్వాత అనుమతించరు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది.
హాల్ టిక్కెట్లను సంబంధిత వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశాం. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పిస్తున్నాం. పరీక్షా కేంద్రాల్లోకి గంట ముందే అనుమతిస్తున్నారు. ఎక్కువ సమయం అనుమతించబడదు. విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుందని అధికారలు తెలిపారు.
CM Revanth Reddy: రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ సర్కార్ సదస్సులు.. మార్చి 1వ తేదీ నుంచి 7 వరకు..?
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు