రాజేశ్ ఖన్నాను ఇప్పటికీ హిందీ చిత్రసీమలో “ఫస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా” అంటూ కీర్తిస్తుంటారు. అంటే అంతకు ముందు హిందీ సినిమా రంగంలోని దిలీప్ కుమార్, రాజ్ కపూర్, దేవానంద్ వంటి స్టార్స్ ‘సూపర్ స్టార్స్’ కాదా అన్న అనుమానం కలుగక మానదు. అంతకు ముందు స్టార్ హీరోస్ కు రాజేశ్ ఖన్నాకు తేడా ఉంది. అదేంటంటే, రాజేశ్ కంటే ముందు స్టార్ డమ్ చూసిన వారంతా ముందు తమ సత్తా నిరూపించుకున్న తరువాతే…
నగుమోము నగ్మా తన నగిషీల మహిమతో తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంది. ఎంతోమంది రసికాగ్రేసరుల కలల సామ్రాజ్యానికి రాణిగా పట్టాభిషిక్తురాలయింది. నాజుకు సోకులతో అలరించడమే కాదు, బరువు పెరిగినా దరువు వేస్తూ సక్సెస్ రూటులో సాగిపోయింది నగ్మా. తెలుగులోనే కాదు, తమిళ, హిందీ, కన్నడ, మళయాళ, భోజ్ పురి, బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ నగ్మా తనదైన బాణీ పలికించింది. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయడానికి ఆమె సిద్ధంగా ఉంది. నగ్మా అసలు పేరు…
సంగీత దర్శకులు తాతినేని చలపతిరావు పేరు వినగానే, ఆయన జానపద బాణీలు మన మదిలో ముందుగా చిందులు వేస్తాయి. తప్పెటపై దరువేస్తూ వరుసలు కట్టడంలో మేటి అనిపించుకున్నారు చలపతిరావు. ఆయన స్వరకల్పనలో అనేక మ్యూజికల్ హిట్స్ రూపొంది జనాన్ని విశేషంగా అలరించాయి. మాతృభాష తెలుగులోనే కాదు, తమిళ, కన్నడ చిత్రాలకూ తనదైన శైలిలో స్వరాలు కూర్చి అక్కడి వారి ఆదరణనూ చూరగొన్నారు చలపతిరావు. చలపతిరావు 1920 డిసెంబర్ 22న జన్మించారు. ఆయన కన్నవారు ద్రోణవిల్లి రత్తయ్య, మాణిక్యమ్మ.…
‘నూటొక్క జిల్లాల అందగాడు’గా నూతన్ ప్రసాద్ పండించిన వినోదాన్ని తెలుగువారు అంత సులువుగా మరచిపోలేరు. నూతన్ ప్రసాద్ మాట, ఆట, నటన అన్నీ ఒకానొక సమయంలో ప్రేక్షకులను కిర్రెక్కించాయి. ఆయన నోట వెలువడిన మాటలు తూటల్లా జనం నోళ్ళలో పేలేవి. ఆయన విలనీ, కామెడీ, ట్రాజెడీ, సెంటిమెంట్ అన్నీ కూడా ఇట్టే ఆకట్టుకొనేవి. నూతన్ ప్రసాద్ అసలు పేరు వరప్రసాద్. 1945 డిసెంబర్ 12న కృష్ణాజిల్లా కైకలూరులో జన్మించారు. చదువుకొనే రోజుల నుంచీ ఆయనకు ఇతరులను అనుకరిస్తూ…
తెలుగునాట మహానటులుగా వెలుగొందిన యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరితోనూ దిలీప్ కుమార్ కు సత్సంబంధాలు ఉండేవి. తెలుగులో యన్టీఆర్, ఏయన్నార్ హీరోలుగా నటించిన ‘పల్లెటూరి పిల్ల’ చిత్రం 1950లో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాను జెమినీ పతాకంపై ఎస్.ఎస్.వాసన్ హిందీలో ‘ఇన్సానియత్’గా రీమేక్ చేశారు. 1955లో విడుదలైన ఈ సినిమాలో ఏయన్నార్ పాత్రలో దిలీప్ కుమార్, యన్టీఆర్ పాత్రలో దేవానంద్ నటించారు. తెలుగులో ఏయన్నార్ ‘దేవదాసు’గా నటించి అలరించగా, ఉత్తరాదిన హిందీ ‘దేవదాస్’లో దిలీప్ నటించి…
నటుడు రఘువరన్ పేరు వినగానే ఆయన విలక్షణమైన పాత్రలు ముందుగా మన మనసులో మెదలుతాయి. తాను ధరించిన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసి, జనాన్ని ఇట్టే కట్టిపడేయడంలో మేటి అనిపించుకున్నారు రఘువరన్. దక్షిణాది భాషలన్నిటా రఘువరన్ నటించి మెప్పించారు. కొన్ని హిందీ చిత్రాలలోనూ రఘువరన్ అభినయం ఆకట్టుకుంది. విలక్షణ నటునిగా జనం మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు రఘువరన్. రఘువరన్ 1958 డిసెంబర్ 11న కేరళలోని కొల్లెంగోడెలో జన్మించారు. ఆయన తండ్రి హోటల్ నడిపేవారు. మధురలో హోటల్…
ప్రస్తుతం సినిమాలకు యువత రాజపోషకులని పలువురి అభిప్రాయం. యువత ఏ చిత్రాన్నైనా తొలి రోజు, మొదటి ఆట చూడాలని తపిస్తుంది, నిజమే! కానీ, ఇంటిల్లి పాదిని సినిమాకు తీసుకు రాగల సత్తా ఒక్క బాలలకే ఉంది. ఇది ఈ నాటి నిజం కాదు! బాలలను ఆకట్టుకోవడం వల్లే అనేక చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాలు మూటకట్టుకోగలిగాయి. ఇక బాలలను ఆకర్షించే అంశాలతో తెరకెక్కిన చిత్రాలు మరింతగా వసూళ్ళ వర్షం కురిపించాయి. ఈ మధ్య విజయాలను తరచిచూచినా, అందులో…
నేటి సమాజంలో టెక్నాలజీ పెరిగిపోయింది. రోజురోజు అత్యాధునిక సాంకేతికతతో ప్రంపచం ముందు వెళుతోంది. కానీ.. కొంతమంది యువత మాత్రం మత్తులో చిత్తవుతూ.. వారి జీవితాలను చిధ్రం చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఏపీలో ఎక్కడ తనిఖీలు చేపట్టినా భారీగా గంజాయి బయటపడుతోంది. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసు శాఖ బస్ స్టేషన్‌లు, రైల్వే స్టేషన్‌లను నిత్యం తనిఖీలు చేస్తూ గంజాయి రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలో సైతం మాదకద్రవ్యాల…
జై భీమ్ చిత్రంలోని ఓ సన్నివేశంలో లాయర్ చంద్రు (సూర్య) కాలు మీద కాలు వేసుకుని ఠీవిగా న్యూస్ పేపర్ చదువుతుండగా.. అతని ఎదురుగా మరో కుర్చీలో కూర్చున్న గిరిజన చిన్నారి అతనిని అనుసరిస్తూ.. పేపరు చేతిలోకి తీసుకుంటూ… భయం భయంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో చంద్రు ఆ పాపకేసి ఎవరికీ భయపడకు (నువ్వు భయపడకు.. నువ్వు అనుకున్నదే చేయి.. ఈ సమాజంలో నీకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకో.. ఆడపిల్ల అంటే ఆబల కాదు సబల అని…
కేంద్రమంత్రి వస్తున్నారని వారంరోజుల ముందు నుంచే హడావిడి చేశారు. బోలుడన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నారు కూడా. తీరా.. ఢిల్లీ నుంచి కేంద్రమంత్రి వచ్చాక.. లెక్కలు చెప్పలేక తడబడ్డారు. సీనియర్లు అనుకున్నవారే గుడ్లు తేలేశారు. కేంద్రమంత్రి పర్యటనలో జరిగిన పరిణామాలపై చర్చ! శ్రీకాకుళం జిల్లాలో ఖద్దరుకు పేరొందిన పొందూరులో ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు. ఎన్నోఏళ్లుగా ఆదరణ లేకుండా పోయిన పొందూరు ఖాదీ, ఖద్దరు పరిశ్రమకు ఆమె పర్యటనతో దశ తిరిగిపోతుందని భావించారు సిక్కోలు…