నూటొక్క జిల్లాల అందగాడు’ నూతన్ ప్రసాద్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘నూటొక్క జిల్లాల అందగాడు’గా నూతన్ ప్రసాద్ పండించిన వినోదాన్ని తెలుగువారు అంత సులువుగా మరచిపోలేరు. నూతన్ ప్రసాద్ మాట, ఆట, నటన అన్నీ ఒకానొక సమయంలో ప్రేక్షకులను కిర్రెక్కించాయి. ఆయన నోట వెలువడిన మాటలు తూటల్లా జనం నోళ్ళలో పేలేవి. ఆయన విలనీ, కామెడీ, ట్రాజెడీ, సెంటిమెంట్ అన్నీ కూడా ఇట్టే ఆకట్టుకొనేవి.
నూతన్ ప్రసాద్ అసలు పేరు వరప్రసాద్. 1945 డిసెంబర్ 12న కృష్ణాజిల్లా కైకలూరులో జన్మించారు. చదువుకొనే రోజుల నుంచీ ఆయనకు ఇతరులను అనుకరిస్తూ వినోదం పంచడం అలవాటు. దాంతో చుట్టూ మిత్రులను పోగేసుకొని, నాటకాలు ఆడడం మొదలెట్టారు. నాటకాలపై ఆసక్తితో ఆయన మన రామాయణ, భారత, భాగవత గాథలను భట్టీయం వేశారు. అప్పట్లో మేటి రంగమార్తాండుల ఫక్కీలో పద్యాలు పాడడం మొదలెట్టారు. అలా పురాణజ్ఙానం వంటపట్టింది. నాటకాల్లో అలవోకగా నటించడమూ మొదలయింది. ‘నావూరు’ అనే నాటికలో నూతన్ ప్రసాద్ అభినయం ఎంతోమందిని ఆకట్టుకుంది. దాంతో సినిమా రంగంలో రాణించాలనే అభిలాష కలిగింది. బాపు-రమణ తెరకెక్కించిన ‘అందాల రాముడు’తో నూతన్ ప్రసాద్ తెరకు పరిచయం అయ్యారు. అప్పుడే ఆయన పేరులో ముందు ‘నూతన్’ చేరింది. ఆ తరువాత బాపు ‘ముత్యాల ముగ్గు’లో గుర్తింపు ఉన్న పాత్ర సంపాదించారు. ‘ప్రాణం ఖరీదు’లో మునుసబు బుల్లెబ్బాయిగా భలేగా ఆకట్టుకున్నారు. ‘చలిచీమలు’, ‘కుడి ఎడమైతే’ చిత్రాలలో నూతన్ ప్రసాద్ డైలాగులు విశేషాదరణ చూరగొన్నాయి. ‘నూటొక్క జిల్లాల అందగాడు’గా జనం మదిలో నిలచిపోయారు. ఆ తరువాత నూతన్ ప్రసాద్ నటించిన ‘కలియుగ భారతం’లో “నవ్వింది ఓ ఆడది నన్ను చూసి నవ్వింది…” అంటూ చెప్పిన డైలాగులు మరింతగా ఆకట్టుకున్నాయి.
Also Read
అప్పట్లో నూతన్ ప్రసాద్ డైలాగుల కోసమే జనం సినిమాలకు వెళ్ళిన రోజులున్నాయి. ఇక ‘ఇంటింటి రామాయణం’లో హీరోలు రంగనాథ్, చంద్రమోహన్ కు సమానంగా నూతన్ ప్రసాద్ పాత్ర కూడా ఉంది. అందులో ఆయనపై చిత్రీకరించిన పాటలు జనాన్ని కుర్చీల్లో కుదురుగా కూర్చోనీయలేదు. ఆ సినిమా తరువాత నూతన్ ప్రసాద్, రమాప్రభ హిట్ పెయిర్ గా మారిపోయారు. బాపు తెరకెక్కించిన పలు చిత్రాలలో నూతన్ ప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తూ మెప్పించారు. బాపు దర్శకత్వంలో రూపొందిన ‘రాజాధిరాజు’లో “కొత్తా దేవుడండీ…” పాటలో నూతన్ ప్రసాద్ నటన, అందులో అతను ధరించిన విలక్షణమైన పాత్ర ఆ సినిమా చూసినవారు ఎప్పటికీ మరచిపోలేరు.
నాటి మేటి నటుల అందరి చిత్రాలలోనూ పలు పాత్రలు పోషించిన నూతన్ ప్రసాద్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున సినిమాల్లోనూ కీ రోల్స్ లో అలరించారు. ‘బామ్మ బాట బంగారుబాట’ సినిమా షూటింగ్ లో ప్రమాదానికి గురై, ఆయన వెన్నుపూస విరిగింది. అప్పటి నుంచీ కుర్చీకే పరిమితమైన నూతన్ ప్రసాద్, అలా ఉన్నా అనేక చిత్రాలలో నటించి ఆకట్టుకున్నారు. కడదాకా తన బాణీ పలికిస్తూనే నటించారు.
“నవభారతం, ప్రజాస్వామ్యం” చిత్రాల ద్వారా ఉత్తమ విలన్ గా నంది అవార్డును వరుసగా అందుకున్నారు నూతన్ ప్రసాద్. “సుందరి-సుబ్బారావు, వసుంధర” చిత్రాల ద్వారా ఉత్తమ సహాయనటునిగానూ నంది అవార్డులు దక్కించుకున్నారు. యన్టీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ 2005లో యన్టీఆర్ అవార్డుతో నూతన్ ప్రసాద్ ను సన్మానించింది. ఆయన చివరగా నటించిన చిత్రాలలో ‘రాజు-మహరాజు’ ఒకటి. 2011 మార్చి 30న ఆయన తుదిశ్వాస విడిచారు. తెలుగువారి మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్న నటుల్లో నూతన్ ప్రసాద్ ఒకరిగా వెలుగొందుతూనే ఉన్నారు.
తాజావార్తలు
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!