రాజేశ్ ఖన్నా – ఫస్ట్ సూపర్ స్టార్ ఎలా అయ్యారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజేశ్ ఖన్నాను ఇప్పటికీ హిందీ చిత్రసీమలో “ఫస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా” అంటూ కీర్తిస్తుంటారు. అంటే అంతకు ముందు హిందీ సినిమా రంగంలోని దిలీప్ కుమార్, రాజ్ కపూర్, దేవానంద్ వంటి స్టార్స్ ‘సూపర్ స్టార్స్’ కాదా అన్న అనుమానం కలుగక మానదు. అంతకు ముందు స్టార్ హీరోస్ కు రాజేశ్ ఖన్నాకు తేడా ఉంది. అదేంటంటే, రాజేశ్ కంటే ముందు స్టార్ డమ్ చూసిన వారంతా ముందు తమ సత్తా నిరూపించుకున్న తరువాతే స్టార్స్ గా ఎదిగారు. రాజేశ్ ఖన్నా అలా కాదు, ‘ఆఖ్రీ ఖత్’లో అలా పరిచయం అయ్యాడో లేదో రెండో సినిమా ‘రాజ్’ లోనే ద్విపాత్రాభినయంచేయడం, ఆ సినిమా విజయం సాధించడం, ఆ పై రాజేశ్ ఖన్నా కాల్ షీట్స్ కు డిమాండ్ పెరగడం జరిగిపోయాయి. అందుకనే రాజేశ్ ఖన్నాను హిందీ చిత్రసీమలో ‘ఫస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా’ అంటారు. ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమాయే అనుకొనే ప్రబుద్ధులకు రాజేశ్ ఖన్నాయే ఫస్ట్ సూపర్ స్టార్ అనిపిస్తుంది. ఆ సంగతి అలా ఉంచితే, హిందీ చిత్రసీమలో రాజేశ్ ఖన్నా హవా విశేషంగా వీచింది. ఆబాలగోపాలాన్నీ అలరించారు. చిన్నపిల్లలు సైతం రాజేశ్ ఖన్నా సినిమానే చూడాలని మారాం చేసేవారు. దీనిని బట్టే రాజేశ్ ఫాలోయింగ్ ఏ పాటిదో ఇట్టే అర్థమవుతుంది. ఇక అప్పటి కన్నెపిల్లల సంగతి వేరే చెప్పాలా? రాజేశ్ తెరపై కనిపిస్తే చాలు ఊగిపోయేవారు.
రాజేశ్ ఖన్నా 1942 డిసెంబర్ 29న అమృత్ సర్ లో జన్మించారు. ఆయన అసలు పేరు జతిన్ ఖన్నా. స్కూల్ లో చదివే రోజుల్లోనే పలు నాటకాల్లో నటించారు ఖన్నా. ‘అంధ్ యుగ్’ అనే నాటకంలో రాజేశ్ ఖన్నా నటన చూసిన ఓ అతిథి, సినిమాల్లో ట్రై చేయమని సూచన ఇచ్చారు. దాంతో సినిమాల బాట పట్టారు ఖన్నా. ఆయన సమీప బంధువు జతిన్ పేరును కాస్తా రాజేశ్ గా మార్చారు. తరువాత ముంబై చేర యునైటెడ్ ప్రొడ్యూసర్స్ అండ్ ఫిలిమ్ ఫేర్ నిర్వహించిన పోటీలో రాజేశ్ ఖన్నా విజేతగా నిలిచారు. 1966లో ‘ఆఖ్రీ ఖత్’తో తొలిసారి రాజేశ్ ఖన్నా తెరపై వెలిగారు.
Also Read
- Kanika Kapoor: ఆమెలా ఉంటే తప్పేముంది.. సినిమాలో కనిపించేది నేనేగా.. కియారా పోలికలపై కనికా కపూర్ ముచ్చట
- Flop Directors : ఈ దర్శకులకు ఛాన్స్ ఇచ్చే హీరోలెవరు.. నెక్ట్స్ మూవీ కన్ఫ్యూజన్లో ఫ్లాప్ డైరెక్టర్స్
- Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
- Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
రాజేశ్ ఖన్నా తమ చిత్రాల్లో ఉంటే చాలు అని భావించిన నిర్మాతలు ఆయనకు బ్లాంక్ చెక్స్ ఆఫర్ చేసిన సందర్భాలూ లేకపోలేదు. రాజేశ్ ఖన్నా సినిమా వస్తోందంటే, ఆయనకంటే సీనియర్ హీరోలు సైతం ఆలోచించి మరీ తమ చిత్రాలను విడుదల చేసేవారు. వరుస విజయాలతో పలు గోల్డెన్ జూబ్లీస్, సిల్వర్ జూబ్లీస్ తన ఖాతాలో వేసుకున్నారు రాజేశ్ ఖన్నా. ఆయనతో కలసి అమితాబ్ బచ్చన్ “ఆనంద్, నమక్ హరామ్” వంటి సినిమాల్లో సైడ్ హీరోగా నటించారు. 1967 నుండి 1974 దాకా ఏడేళ్ళ పాటు రాజేశ్ ఖన్నా సూపర్ స్టార్ గా రాజ్యమేలారు. 1973లో ఏయన్నార్ హీరోగా వి.బి.రాజేంద్రప్రసాద్ తెరకెక్కించిన ‘బంగారుబాబు’లో రాజేశ్ ఖన్నా గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. అనూహ్యంగా రాజేశ్ ను పరాజయాలు పలకరించడం మొదలు పెట్టాయి. 1973లో డింపుల్ కపాడియాను పెళ్ళాడారు. వారికి ఇద్దరు పిల్లలు. ట్వింకిల్ ఖన్నా, రింకీ ఖన్నా. ఈ నాటి మేటి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా. కొద్దిరోజులకే రాజేశ్, డింపుల్ విడిపోయారు. అయితే విడాకులు తీసుకోలేదు.
రాజేశ్ ఖన్నా రాజకీయాల్లోనూ రాణించారు. మన దాసరి నారాయణరావు తెరకెక్కించిన ‘ఆజ్ కా ఎమ్.ఎల్.ఏ రామ్ అవతార్’ లో ఎమ్మెల్యేగా నటించి ఆకట్టుకున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే తెలుగునాట యన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పట్లో ఆ విజయాన్ని పురస్కరించుకొని, రాజేశ్ ఖన్నా తన యూనిట్ సభ్యులకు స్వీట్స్ పంచిపెట్టారు. ఏదో ఒక రోజున తాను కూడా రాజకీయాల్లోకి వస్తానని అప్పట్లోనే భావించారు రాజేశ్ ఖన్నా. 1992లో న్యూ ఢిల్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపు సాధించారు. ఆ సమయంలో డింపుల్, ఆమె పిల్లలు కలసి రాజేశ్ కు ప్రచారం కూడా చేశారు. అపూర్వ విజయాలు, అద్భుతమైన ఆదరణ చవిచూసిన రాజేశ్ ఖన్నా రాజాలాగే తనువు చాలించారు. 2013లో ఆయనకు పద్మభూషణ్ అవార్డు లభించింది. ఈ నాటికీ సూపర్ స్టార్ డమ్ గురించి చర్చ సాగితే రాజేశ్ ఖన్నా పేరే బాలీవుడ్ లో ముందుగా వినిపిస్తూ ఉంటుంది.
తాజావార్తలు
-
CSK-IPL 2027: చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో షాక్.. స్టార్ కోచ్ కూడా గుడ్‌బై.. సీఎస్కే భవిష్యత్‌పై బెంగ!
-
Kanika Kapoor: ఆమెలా ఉంటే తప్పేముంది.. సినిమాలో కనిపించేది నేనేగా.. కియారా పోలికలపై కనికా కపూర్ ముచ్చట
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
-
Flop Directors : ఈ దర్శకులకు ఛాన్స్ ఇచ్చే హీరోలెవరు.. నెక్ట్స్ మూవీ కన్ఫ్యూజన్లో ఫ్లాప్ డైరెక్టర్స్
ట్రెండింగ్
-
8,000 నిట్స్ OLED డిస్‌ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!