మనిషి జీవించడానికి వారంలో ఐదు నుండి ఆరు రోజులు కష్టపడతాడు. ఇక వారంలో విశ్రాంతి తీసుకోవడానికి ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అసలు ఆదివారం సెలవు ఎందుకు వచ్చిందా అనే విషయం మీరు ఎవరైనా గమనించారా? మరి ఆదివారం సెలవు ఎందుకు వచ్చిందో అన్న విషయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. అసలు ఆదివారం సెలవు ఎందుకు వచ్చింది అని అడిగితే ప్రశ్నకు సమాధానం చాలా మంది వరకు…
ఉక్రెయిన్ తో యుద్దం తీవ్ర స్థాయిలో జరుగుతున్న వేళ రష్యా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం జరిపింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదిగా దీనిని పేర్కొంటున్నారు. ఎలాంటి క్షిపణి రక్షణ వ్యవస్థనైనా ఇది ఛేదించగలదు. క్షిపణి పరీక్ష సూపర్ సక్సెస్ అని ప్రెసిడెంట పుతిన్ స్వయంగాప్రకటించారు. ఆయనకు ఎంతో ఇష్టమైన ఈ డెడ్లీ మిసైల్ పేరు సర్మత్. రష్యా అమ్ములపొదిలో వున్న కింజల్, అవాంగార్డ్ క్షిపణుల సరసన త్వరలో సర్మత్ చేరనుంది. అప్పుడు రష్యా వైపు చూడాలంటే శత్రువులు…
హౌస్ షిఫ్టింగ్ ఛార్జీలను తగ్గించడానికి 3 తెలివైన చిట్కాలు భారతదేశంలో, సరైన ప్రణాళిక లేకుండా, గృహాలను మార్చడం కష్టం మరియు ఖరీదైనది. అంతేకాకుండా, ప్యాకింగ్ & మూవింగ్ ప్రాసెస్‌లో ప్రతి ఒక్క అడుగులోనూ మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి ఇది చాలా ఒత్తిడితో కూడిన అనుభవంగా మార వచ్చు. అందుకే మీ వస్తువులను కొత్త ఇంటికి మార్చడానికి సురక్షితమైన సేవలను అందించ్చే మంచి అనుభవం ఉన్న ప్రొఫెషనల్ ప్యాకర్ మూవర్‌లను నియమించుకోవడం ఉత్తమం. Packers and…
రచయితగా సాహితీరంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న గొల్లపూడి మారుతీరావు నటనలోనూ తన బాణీ పలికించారు. ఈ తరం వారికి గొల్లపూడి అనగానే ఓ సినిమా నటుడు అనే తెలిసి ఉండవచ్చు. కానీ, రచయితగా ఆయన కలం సాగిన తీరును గుర్తు చేసుకుంటే సాహిత్యాభిమానులకు ఈ నాటికీ పరవశం కలుగక మానదు. రచయితగా, కథకునిగా, నాటకరచయితగా, విలేఖరిగా, ఉపసంపాదకునిగా, సంపాదకునిగా పత్రికారంగంలో పలు విన్యాసాలు చేసిన గొల్లపూడి మారుతీరావు కలం అన్నపూర్ణా వారి ‘డాక్టర్ చక్రవర్తి’ (1964)లో…
ఏదైనా శుభకార్యం ఆరంభించే ముందు ‘శ్రీరామజయం’ అని రాయడం తెలుగువారికి ఓ సంప్రదాయం. అదే తీరున తెలుగు చిత్రసీమలోనూ శ్రీరామనామమే విజయగీతం పాడించింది. మన భారతదేశంలో రూపొందిన తొలి టాకీ చిత్రంగా ‘ఆలమ్ ఆరా’ నిలచింది. ఈ సినిమా 1931 మార్చి 14న విడుదలయింది. మంచి విజయం సాధించింది. అందువల్ల ఆ చిత్ర నిర్మాత, దర్శకుడు దక్షిణాదిన కూడా ఓ సినిమా నిర్మించాలని సంకల్పించారు. ఆ సంకల్పానికి ఆయన అసోసియేట్ గా ఉన్న తెలుగువారయిన హెచ్.ఎమ్.రెడ్డి కూడా…
టాలెంట్ ఏ ఒక్కరి సొంతం కాదు. దానికి పేదవారు…ధనవంతులతో పని లేదు. పట్టుదల..కష్టపడే తత్వం ఉంటే చాలు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న జూనియర్ మహిళల హాకీప్రపంచకప్‌లో అద్భుతంగా ఆడుతున్న ముంతాజ్ కథ అలాంటిదే. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముంతాజ్‌ది ఓ నిరుపేద కుటుంబం. ఆరుగురు అక్కా చెల్లెళ్లు..ఒక సోదరుడు. తండ్రి సంపాదన అంతంత మాత్రమే. కుటుంబం గడవటానికి తల్లి కైసర్ జహాన్ తోపుడు బండిపై కూరగాయలు అమ్ముతుంది. శుక్రవారం దక్షిణ కొరియాపై ముంతాజ్ విజృంభించి ఆడుతున్న సమయంలో ..ఇక్కడ క్నోలోని…
శేషశైలవాసుని మురిపించిన స్వరకర్త … పార్వతీవల్లభుని పరవశింప చేసిన బాణీలు… చంద్రకళాధరి ఈశ్వరినే ప్రసన్నం చేసుకున్న సంగీతనిధి పెండ్యాల నాగేశ్వరరావు. చిగురాకులలో చిలకమ్మలకు సైతం పాట నేర్పిన బాట ఆయనది. వెన్నెల రాజులనే పులకింపచేసిన స్వరకేళి ఆయన సొంతం} ఆయన పంచిన మధురం మరపురానిది- మరువలేనిది. పెండ్యాల వారి మది శారదాదేవి మందిరం. ఆ విద్యల తల్లి అనుగ్రహంతోనే పెండ్యాల సంగీతం పండిత పామరభేదం లేకుండా అందరినీ అలరించింది. ఈ నాటికీ అలరిస్తూనే ఉంది. పెండ్యాల నాగేశ్వరరావు…
పునీత్ రాజ్ కుమార్ – ఈ పేరు వినగానే కన్నడ జనాల్లో ఓ ఆనందతరంగం ఎగసి పడుతుంది. పునీత్ చురుకైన అభినయం చూసి ముగ్ధులై పోయిన జనం, ఆయన మానవత్వాన్ని తెలుసుకొని మరింత అభిమానం పెంచుకున్నారు. సదా మోముపై చిరునవ్వులతో కనిపించిన పునీత్ అభిమానులను శోకసంద్రంలో ముంచి వెళ్ళిపోయారు. కానీ, ఆయన నవ్వు మాత్రం అభిమానుల హృదయాల్లో నిలచే ఉంది. తన సంపాదనలో కొంత భాగాన్ని సామాజిక సేవకే వినియోగించే ఆ మంచి మనిషి ఇక రాడని…
“మళ్ళీ కూయవే గువ్వా…మోగిన అందెలమువ్వ… తుళ్ళి పాడవే పువ్వా… గుండెల సవ్వడి మువ్వా…” – ఈ పాట అప్పట్లో కుర్ర కారు గుండెలను మీటింది. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ లోని ఈ పాటతోనే గీత రచయిత కందికొండ యాదగిరి చిత్రసీమకు పరిచయమయ్యారు. తొలి చిత్రంలోనే తన కవితాశోభను జనానికి పరిచయం చేయగలిగారు కందికొండ. దర్శకుడు పూరి, సంగీత దర్శకుడు చక్రి సైతం ఆయనలోని ప్రతిభను ప్రోత్సహిస్తూ అదే చిత్రంలో “నీకోసం వేచి వేచి…
గత మూడు సంవత్సరాల క్రితం ఇదే రోజున భారతావని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథిపురా (అవంతిపురా) సమీపంలో కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగిందనే వార్తలు జాతీయ మీడియాలో ఫ్లాష్ న్యూస్‌గా ప్రసారమవుతున్నాయి. ఇది చూసిన సైనికుల కుటుంబాలలో ఏదో తెలియని భయం.. ఆ భయంతోనే భారత సైనికదళంలో ఉన్న తమతమ వారికి ఫోన్ చేసి తమ వారు ఎలా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నాలు…