టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరపున ఐదు వికెట్ల హాల్ సాధించిన అతి పెద్ద వయుష్కుడిగా వరుణ్ రికార్డుల్లోకెక్కాడు. 33 సంవత్సరాల 73 రోజుల వయస్సులో ఈ ఫీట్ నమోదు చేశాడు. గెబేహా వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో వరుణ్ 5 వికెట్స్ (5/17) తీశాడు. ఇంతకుముందు ఈ రికార్డు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (32 సంవత్సరాల, 215 రోజులు) పేరిట ఉండేది. ఓవరాల్‌గా…
టీ20ల్లో 125, 140 స్కోర్లను కాపాడుకోవడం చాలా కష్టమని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. దక్షిణాఫ్రికాపై రెండో టీ20లో తమ కుర్రాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని ప్రశంసించాడు. ఓ దశలో గెలిచేలా కనిపించినా.. లక్ష్యం పెద్దది కాకపోవడంతో ఓటమి తప్పలేదన్నాడు. మూడో టీ20 జరిగే జోహెన్నెస్ బర్గ్‌లో మరింత ఎంటర్‌టైర్‌మెంట్ ఖాయం అని సూర్య చెప్పాడు. ఆదివారం గెబేహా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్ 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 125 పరుగుల…
మొదటి మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకున్న భారత్‌కు రెండో టీ20లో ఓటమి తప్పలేదు. గెబేహా వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 125 పరుగుల లక్ష్యాన్ని ప్రొటీస్ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (5/17) మాయతో భారత్‌ను గెలుపు దిశగా నడిపించినా.. ట్రిస్టియన్ స్టబ్స్ (47 నాటౌట్; 41 బంతుల్లో 7×4), కొయెట్జీ (19; నాటౌట్; 9…
సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత్.. టీ20ల సిరీస్ కోసం దక్షిణాఫ్రికాకు భారత్ వెళ్లిన విషయం తెలిసిందే. నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు డర్బన్ వేదికగా మొదటి మ్యాచ్ జరగనుంది. పొట్టి ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికాపై టీమిండియాదే ఆధిక్యం అయినా.. ఈసారి మాత్రం గట్టి పోటీనిచ్చేందుకు ప్రెషన్ టీమ్ సిద్ధంగా ఉంది. అంతేకాదు టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ ఓటమికి బదులు తీర్చుకోవాలని చూస్తోంది. దాంతో ఈ సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ సిరీస్‌లో టీమిండియా…
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నేటి నుంచి టీ20 సిరీస్ జరగనుంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు డర్బన్ వేదికగా మొదటి మ్యాచ్ జరగనుంది. రాత్రి 8.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. టీ20 ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికాను ఢీకొనడం సవాలే. అందులోనూ ప్రొటీస్ సొంత గడ్డపై అంటే మాములు విషయం కాదు. మరోవైపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా లాంటి సీనియర్లు టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలకగా.. పెద్దగా అనుభవం లేని యువ జట్టు…
దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య నవంబర్ 8 నుంచి టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా నవంబర్ 8న తొలి మ్యాచ్ డర్బన్ వేదికగా జరగనుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే దక్షిణాఫ్రికాకు చేరుకొన్న భారత జట్టు ప్రాక్టీస్‌లో నిమగ్నమైంది. భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. సిరీస్ లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది. దక్షిణాఫ్రికా, భారత్ టీ20ల…
Dale Steyn React on Cape Town Pitch: కేప్ టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. కేవలం ఒకటిన్నర రోజుల్లో ఇరు జట్ల మధ్య 107 ఓవర్లు మాత్రమే పడ్డాయి. కేప్ టౌన్ పిచ్ మ్యాచ్ ప్రారంభం నుంచే ప్రమాదకరంగా మారింది. చాలా బంతులు బ్యాట్స్‌మెన్ పైకి వచ్చి ఇబ్బందులకు గురి చేశాయి. తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ, రెండో ఇన్నింగ్స్‌లో ఐడెన్ మార్‌క్రమ్ మినహా ఎవరూ…
Rohit Sharma Capain Record in Cape Town: రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్‌ను 1-1తో రోహిత్ సేన సమం చేసింది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టు టెస్టు సిరీస్ గెలవలేదు. అయితే దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ను డ్రా చేసుకోవడం మాత్రం ఇది రెండోసారి. 2011లో ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత్ టెస్టు సిరీస్‌ను డ్రా చేసుకుంది.…
పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్‌కు పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ట్రాన్స్‌లేటర్‌గా మారాడు. సిరాజ్ హిందీలో మాట్లాడితే.. బుమ్రా ఆ వ్యాఖ్యలను ఆంగ్లంలోకి అనువదించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విషయం సాధించింది. ఈ విజయంలో బుమ్రా, సిరాజ్ కీలక పాత్ర పోషించారు. తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ 6 వికెట్స్ తీయగా.. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా 6…
KL Rahul React on Shortest Test in Cricket History at Cape Town: కేప్‌టౌన్‌లో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికాపై భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఫాస్ట్ బౌలర్లు మొహ్మద్ సిరాజ్ (6/15), జస్ప్రీత్ బుమ్రా (6/61) చెలరేగడంతో భారత్ సునాయాస విజయాన్ని అందుకుంది. ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే ఆలౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో 176 పరుగులకే పరిమితమైంది. మొదటి ఇన్నింగ్స్‌లో 153…