ఐపీఎల్ 2024లో అదరగొట్టిన వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు టీ20 ప్రపంచకప్ 2024లో చోటు దక్కింది. మెగా టోర్నీకి ఎంపికైనా ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ప్రపంచకప్ అనంతరం శ్రీలంక పర్యటనలో వచ్చిన రెండు అవకాశాలను వృథా చేసుకున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. బంగ్లాదేశ్‌తో �
తెలుగు కుర్రాడు తిలక్ వర్మ గురించి టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర విషయం చెప్పాడు. రెండో టీ20 అనంతరం తిలక్ తన వద్దకు వచ్చి.. మూడో మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బరిలోకి దిగుతానని చెప్పాడన్నాడు. తనను అడిగి మరీ ఛాన్స్ తీసుకున్న తిలక్.. సెంచరీతో సత్తా చాటాడని సూర్య తెలిపాడు. చివరివరకూ ఉత్కంఠ ర
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన మూడో టీ20లో రెండు వికెట్స్ తీయడంతో వరుణ్ ఖాతాలో ఈ
తెలుగు తేజం, భారత్ యువ బ్యాటర్ తిలక్ వర్మ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో దక్షిణాఫ్రికాపై సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డుల్లో నిలిచాడు. నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా బుధవారం జరిగిన మూడో టీ20లో తిలక్ సెంచరీ (107 నాటౌట్; 56 బంతుల్లో 8×4, 7×6) చేయడంతో ఈ ఫీట్ నమోదు చేశాడ�
నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత్ విజయం సాధించింది. 220 పరుగుల ఛేదనలో దక్షిణాఫ్రికా 7 వికెట్లకు 208 పరుగులు చేయడంతో టీమిండియా 11 పరుగుల తేడాతో నెగ్గింది. ఛేదనలో హెన్రిచ్ క్లాసెన్ (41; 22 బంతుల్లో 1×4, 4×6), మార్కో యాన్సెన్ (54; 17 బంతుల్లో 4×4, 5×6) సంచలన
IND vs SA: సెంచూరియన్ వేదికగా భారత్ – దక్షిణాఫ్రికా (IND vs SA) జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. తెలుగు ఆటగాడు తిలక్ వర్మ సెంచరీతో దక్షిణాఫ్రికా బౌలర్లను చితకబాదాడు. మరోవైపు వరుస వికెట్లు పడిపోతున్న తా�
IND vs SA: నేడు టీమిండియా టీ20 జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్ వేదికగా నేడు దక్షిణాఫ్రికాతో మూడో టీ20 జరగనుంది. ఈ దక్షిణాఫ్రికా పర్యటనను ఘన విజయంతో మొదలు పెట్టిన టీమిండియా, రెండో మ్యాచ్‌లో తడబడి ఓటమిని చవి చూసింది. దాంతో నేడు జరిగే మూడో టీ20 కీలకం కానుంది. ఈ మ్యాచ్ లో గెలిచి �
భారత టీ20 జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో నేడు మూడో టీ20లో తలపడనుంది. దక్షిణాఫ్రికా పర్యటనను ఘన విజయంతో ఆరంభించిన భారత్.. రెండో మ్యాచ్‌లో తడబడింది. దాంతో మూడో టీ20 కీలకంగా మారింది. ఈ టీ20లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని సూర్య సేన చూస్తోంది. బుధవారం రాత్రి 8.30 గంటల
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో కేవలం 7 పరుగులే చేసిన అభిషేక్.. రెండో టీ20లో 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. పోర్ట్ ఎలిజిబెత్‌లో కోయిట్జీ బౌలింగ్‌లో చెత్త ఆడి ఔటయ్యాడు. జింబాబ్వేపై ఒక సెంచరీ మినహా.. అభిషేక్ టీ20ల్లో రాణించడంల�
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరపున ఐదు వికెట్ల హాల్ సాధించిన అతి పెద్ద వయుష్కుడిగా వరుణ్ రికార్డుల్లోకెక్కాడు. 33 సంవత్సరాల 73 రోజుల వయస్సులో ఈ ఫీట్ నమోదు చేశాడు. గెబేహా వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో వరుణ్ 5 వికెట