దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య నవంబర్ 8 నుంచి టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా నవంబర్ 8న తొలి మ్యాచ్ డర్బన్ వేదికగా జరగనుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే దక్షిణాఫ్రికాకు చేరుకొన్న భారత జట్టు ప్రాక్టీస్‌లో నిమగ్నమైంది. భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. సిరీస్ లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది.
దక్షిణాఫ్రికా, భారత్ టీ20ల సిరీస్‌ను స్పోర్ట్స్ 18 ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. అంతేకాదు జియో సినిమాలో కూడా లైవ్ టెలికాస్ట్ కానుంది. మొదటి మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8.30కి ఆరంభం అవుతుంది. రెండో టీ20 రాత్రి 7.30కి ప్రారంభం కానుండగా.. చివరి రెండు టీ20లు రాత్రి 8.30కి ఆరంభం అవుతాయి. డర్బన్, గబెరా, సెంచూరియన్, జొహ్నస్‌బర్గ్ వేదికలలో టీ20 సిరీస్ జరగనుంది.
సిరీస్ షెడ్యూల్:
తొలి టీ20 – నవంబర్ 8 (డర్బన్)
రెండో టీ20 – నవంబర్ 10 (గబెరా)
మూడో టీ20 – నవంబర్ 13 (సెంచూరియన్)
నాలుగో టీ20 – నవంబర్ 15 (జొహ్నస్‌బర్గ్)
Also Read: Pushpa 2: రిలీజ్‌కు ముందే రేర్ రికార్డ్.. ఫుల్ ఖుషీ అవుతున్న అల్లు అర్జున్ ఫాన్స్!
టీమ్స్:
భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకు సింగ్, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్య, రమణ్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, సంజు శాంసన్, జితేశ్ శర్మ, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, విజయ్‌కుమార్ వైశాఖ్, అర్ష్‌దీప్ సింగ్, యశ్ దయాళ్, అవేశ్ ఖాన్.
దక్షిణాఫ్రికా జట్టు:
మార్‌క్రమ్ (కెప్టెన్), బార్ట్‌మన్, కొయెట్జీ, డొనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్క్ యాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, పాట్రిక్ క్రగర్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, మిలాలి ఎంపొంగ్వానా, ఎంకాబా పీటర్, రికల్టన్, సైమ్‌లేన్, సిపామ్లా, స్టబ్స్.