SA vs IND: 125 టార్గెట్‌ను కాపాడుకోవడం కష్టమే.. మా కుర్రాళ్లు అద్భుతం: సూర్య
- రెండో టీ20లో టీమిండియా ఓటమి
- వరుణ్ బౌలింగ్‌ను ఆస్వాదించాం
- అక్కడ మరింత ఎంటర్‌టైర్‌మెంట్ పక్కా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20ల్లో 125, 140 స్కోర్లను కాపాడుకోవడం చాలా కష్టమని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. దక్షిణాఫ్రికాపై రెండో టీ20లో తమ కుర్రాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని ప్రశంసించాడు. ఓ దశలో గెలిచేలా కనిపించినా.. లక్ష్యం పెద్దది కాకపోవడంతో ఓటమి తప్పలేదన్నాడు. మూడో టీ20 జరిగే జోహెన్నెస్ బర్గ్‌లో మరింత ఎంటర్‌టైర్‌మెంట్ ఖాయం అని సూర్య చెప్పాడు. ఆదివారం గెబేహా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్ 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 125 పరుగుల లక్ష్యాన్ని ప్రొటీస్ టీమ్ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ… ‘ఏ మ్యాచ్‌లో అయినా టార్గెట్‌ను ఎంత ఉంచినా.. దాన్ని కాపాడుకొనేందుకు ప్రయత్నించాలి. టీ20ల్లో 125, 140 స్కోర్లను కాపాడుకోవడం చాలా కష్టం. ఇది అందరికీ తెలిసిన విషయమే. టార్గెట్ తక్కువగా ఉన్నా మా కుర్రాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఓ దశలో మేం గెలిచేలా కనిపించినా లక్ష్యం పెద్దది కాకపోవడంతో ఓటమి తప్పలేదు. వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం అద్భుతం. అతడు గత కొన్నేళ్లుగా చాలా శ్రమిస్తున్నాడు. ఈ ప్రదర్శనకు అదే కారణం. ప్రతి ఒక్కరం వరుణ్ బౌలింగ్‌ను ఆస్వాదించాం. సిరీస్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. తప్పకుండా మేం సిరీస్‌ను సాధిస్తాం. మూడో టీ20 మ్యాచ్ జోహెన్నెస్ బర్గ్‌లో జరగనుంది. అక్కడ మరింత ఎంటర్‌టైర్‌మెంట్ పక్కా’ అని తెలిపాడు.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
- Haribabu Murder: ‘ఎస్.. నేనే చంపేశా’.. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
- MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
- Abhishek Sharma: అభిషేక్ విధ్వంసకర సెంచరీ చూడలేకపోయారా.? ఏం పర్లేదు.. ఇక్కడ చూసేయండి.!
Also Read: Koti Deepotsavam 2024: ఉజ్జయిని మహాకాళ్ కల్యాణం, పల్లకీ వాహన సేవ.. మూడవ రోజు విశేష కార్యక్రమాలు ఇవే!
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 124 పరుగులు చేసింది. తిలక్ వర్మ (20; 20 బంతుల్లో 1×4, 1×6), అక్షర్ పటేల్ (27; 21 బంతుల్లో 4×4), హార్దిక్ పాండ్యా (39 నాటౌట్; 45 బంతుల్లో 4×4, 1×6) పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో తలో వికెట్ పడగొట్టారు. లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ట్రిస్టియన్ స్టబ్స్ (47 నాటౌట్; 41 బంతుల్లో 7×4), కొయెట్జీ (19; నాటౌట్; 9 బంతుల్లో 2×4, 1×6) రాణించారు. భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (5/17) అద్భుత బౌలింగ్ చేశాడు.
తాజావార్తలు
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
TVS Ronin Base+ Variant: TVS Ronin కొత్త Base+ వేరియంట్ లాంచ్.. తక్కువ ధరకే డ్యూయల్ ABS, అదనపు ఫీచర్లు
-
Haribabu Murder: ‘ఎస్.. నేనే చంపేశా’.. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
-
MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
ట్రెండింగ్
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!