Surya Kumar Yadav: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. ‘సూరీడు’ని ఊరిస్తున్న రికార్డ్స్ ఇవే!
- దక్షిణాఫ్రికాతో భారత్ టీ20 సిరీస్
- మూడు రెకార్డులపై కన్నేసిన సూర్యకుమార్
- ఓ సెంచరీ చేస్తే వారితో సమంగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత్.. టీ20ల సిరీస్ కోసం దక్షిణాఫ్రికాకు భారత్ వెళ్లిన విషయం తెలిసిందే. నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు డర్బన్ వేదికగా మొదటి మ్యాచ్ జరగనుంది. పొట్టి ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికాపై టీమిండియాదే ఆధిక్యం అయినా.. ఈసారి మాత్రం గట్టి పోటీనిచ్చేందుకు ప్రెషన్ టీమ్ సిద్ధంగా ఉంది. అంతేకాదు టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ ఓటమికి బదులు తీర్చుకోవాలని చూస్తోంది. దాంతో ఈ సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ ‘సూరీడు’ని పలు రికార్డులు ఊరిస్తున్నాయి.
# సూర్యకుమార్ యాదవ్ దక్షిణాఫ్రికాపై ఏడు మ్యాచుల్లో 346 పరుగులు చేశాడు. మరో 107 పరుగులు చేస్తే.. భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచుల్లో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ (452) సూర్య కంటే ముందున్నాడు.
Also Read
- Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
- How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
# ఈ సిరీస్‌లో సూర్యకుమార్ మరో 6 సిక్స్‌లు కొడితే.. టీ20ల్లో 150 సిక్సర్ మార్క్‌ను అందుకుంటాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (205), మార్టిన్ గప్తిల్ (173) ముందున్నారు. ప్రస్తుతం సూర్య 144 సిక్స్‌లతో మూడో స్థానంలో ఉన్నాడు. నికోలస్ పూరన్ (144) నాలుగు స్థానంలో కొనసాగుతున్నాడు.
# సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో నాలుగు సెంచరీలు బాదాడు. ఈ జాబితాలో గ్లెన్ మాక్స్‌వెల్ (5), రోహిత్ శర్మ (5) ముందున్నారు. దక్షిణాఫ్రికాపై ఓ సెంచరీ చేస్తే.. వారితో సమంగా సూర్య నిలుస్తాడు. రెండు శతకాలు చేస్తే.. అగ్ర స్థానంకు దూసుకెళ్తాడు.
Also Read: WPL 2025: 24 మంది క్రికెటర్లను వదిలేసిన ఫ్రాంఛైజీలు.. రిటెన్షన్, రిలీజ్ లిస్ట్ ఇదే!
సూర్యకుమార్ యాదవ్ 2021లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు భారత్ తరఫున 74 టీ20లు ఆడిన సూరీడు.. 2,544 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 169.48 స్ట్రైక్‌రేట్, 42.4 యావరేజ్‌తో రన్స్ చేశాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ అనంతరం సూర్య టీ20 పగ్గాలు అందుకున్నాడు.
తాజావార్తలు
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..