SA vs IND: వరుణ్ మాయ చేసినా.. రెండో టీ20లో భారత్‌కు తప్పని ఓటమి!
- రెండో టీ20లోభారత్ ఓటమి
- వరుణ్ చక్రవర్తి (5/17) అద్భుత బౌలింగ్
- హార్దిక్ పాండ్యా విలువైన ఇన్నింగ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొదటి మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకున్న భారత్‌కు రెండో టీ20లో ఓటమి తప్పలేదు. గెబేహా వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 125 పరుగుల లక్ష్యాన్ని ప్రొటీస్ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (5/17) మాయతో భారత్‌ను గెలుపు దిశగా నడిపించినా.. ట్రిస్టియన్ స్టబ్స్ (47 నాటౌట్; 41 బంతుల్లో 7×4), కొయెట్జీ (19; నాటౌట్; 9 బంతుల్లో 2×4, 1×6) పోరాడడంతో మ్యాచ్ దక్షిణాఫ్రికా సొంతమైంది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 124 పరుగులే చేసింది. సెంచరీ హీరో సంజూ శాంసన్ డకౌట్ కాగా.. అభిషేక్ శర్మ (4) మరోసారి నిరాశపరిచాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (4) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. దీంతో 4 ఓవర్లకు భారత్ స్కోర్ 15/3. ఈ దశలో తిలక్ వర్మ (20; 20 బంతుల్లో 1×4, 1×6), అక్షర్ పటేల్ (27; 21 బంతుల్లో 4×4) జట్టును ఆదుకున్నారు. అయితే తిలక్, అక్షర్ కొద్ది వ్యవధిలో అవుట్ అయ్యారు. హార్దిక్ పాండ్యా (39 నాటౌట్; 45 బంతుల్లో 4×4, 1×6) విలువైన ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ ఆ మాత్రం స్కోరైనా చేసింది.
Also Read
125 పరుగుల లక్ష్యంను దక్షిణాఫ్రికా అలవోకగా ఛేదించేస్తుందనుకుంటే.. వరుణ్ చక్రవర్తి దెబ్బకు వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమి బాటలో పయనించింది. రికిల్‌టన్ (13)ను ఔట్ చేసి అర్ష్‌దీప్ జట్టుకు సింగ్ శుభారంభం ఇవ్వగా.. ఆ తర్వాత అద్భుత స్పెల్‌తో వరుణ్ సఫారీలను వణికించాడు. మార్‌క్రమ్ (3), హెండ్రిక్స్ (24), యాన్సెన్ (7), క్లాసెన్ (2), మిల్లర్ (0)లను అవుట్ చేశాడు. దాంతో 16 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్ 88/7కు చేరుకుంది. చివరి 4 ఓవర్లలో 37 పరుగులు చేయడం కష్టమే అనిపించింది. కానీ అర్ష్‌దీప్ వేసిన 17వ ఓవర్లో కొయెట్జీ 6, 4 కొట్టడంతో మ్యాచ్ భారత్ నుంచి చేజారిపోయింది. 18వ ఓవర్లో అవేష్ రెండు ఫోర్లు, 19వ ఓవర్లో అర్ష్‌దీప్ నాలుగు ఫోర్లు ఇవ్వడంతో మ్యాచ్ పోయింది. ఈ విజయంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది. మూడో టీ20 బుధవారం జరగనుంది.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!