Rohit Sharma: తొలి ఆసియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ అరుదైన రికార్డు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma Capain Record in Cape Town: రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్‌ను 1-1తో రోహిత్ సేన సమం చేసింది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టు టెస్టు సిరీస్ గెలవలేదు. అయితే దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ను డ్రా చేసుకోవడం మాత్రం ఇది రెండోసారి. 2011లో ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత్ టెస్టు సిరీస్‌ను డ్రా చేసుకుంది. ఇప్పుడు ఆ ఘనత సాధించడం ద్వారా ధోనీ రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు.
దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు ఏడుగురు భారత సారథుల నేతృత్వంలో టీమిండియా టెస్టు సిరీస్‌లు ఆడింది. ఇందులో ఇద్దరు కెప్టెన్లు మాత్రమే సిరీస్‌ను డ్రా చేశారు. మిగతా ఐదుగురు కెప్టెన్లు మాత్రం సిరీస్ ఓటమిని ఎదుర్కొన్నారు. ఇక కేప్‌టౌన్ మైదానంలో ఇరు జట్ల మధ్య మొత్తం 6 టెస్టు మ్యాచ్‌లు జరగ్గా.. అందులో 4 మ్యాచ్‌ల్లో భారత్ ఓడిపోయింది. మరో 2 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. రోహిత్ శర్మ సారథ్యంలోని 7వ మ్యాచ్‌లో భారత్ తొలి టెస్టు విజయం సాధించింది. అంతేకాదు ఈ ఘనత ఏ ఆసియా కెప్టెన్‌కు సాధ్యం కాలేదు.
Also Read
- Supreme Court: 20 మంది రెబల్ తృణమూల్ ఎంపీలకు సుప్రీం నోటీసులు..
- Rajnath Singh: భారత్‌కు ఇక క్షిపణుల కొరత ఉండదు.. కేంద్రం సంచలన నిర్ణయం..
- Tarun Tejpal: అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు షాక్.. 2 వారాల్లో లొంగిపోవాలని తేజ్‌పాల్‌కు ఆదేశం
- Mojtaba Khamenei: మోజ్తబా ఖమేనీ అరుదైన వీడియో విడుదల.. అనుమానాల వేళ వైరల్
Also Read: IND vs SA: సిరాజ్ హిందీకి బుమ్రా అనువాదం.. వీడియో వైరల్!
భారత్ ఇప్పటివరకు దక్షిణాఫ్రికా గడ్డపై 5 టెస్టులు మాత్రమే గెలుచుకుంది. జోహనెస్‌బర్గ్‌లో రెండు గెలవగా.. డర్బన్, సెంచూరియన్, కేప్‌టౌన్‌లో ఒక్కొ మ్యాచ్ గెలిచింది. దక్షిణాఫ్రికాలో భారత్ మొత్తం 25 టెస్టులు ఆడగా.. ఐదు టెస్టుల్లో మాత్రమే విజయం సాధించింది. భారత్ 13 టెస్టుల్లో ఓటమి పాలవ్వగా.. ఏడింటిని డ్రా చేసుకుంది. దక్షిణాఫ్రికా గడ్డపై ఇప్పటివరకు ఒక టెస్ట్ సిరీస్ కూడా భారత్ గెలవలేదు.
తాజావార్తలు
-
Bandi Sanjay : ఫీజు బకాయిలపై బండి సంజయ్ ఫైర్.. కాంగ్రెస్‌కు డెడ్‌లైన్.!
-
Endurance Ship: 100ఏళ్ల రహస్యం..ఓడ మిస్టరీ వీడింది!
-
Kotha Cinema: హైదరాబాద్‌లోనే సినిమాలెందుకు తీయాలంటూ 100 మందితో సింగరేణి కుర్రాడు “కొత్త సినిమా”!**
-
Supreme Court: 20 మంది రెబల్ తృణమూల్ ఎంపీలకు సుప్రీం నోటీసులు..
-
Raviteja: మాస్ మహారాజా కొత్త జాతర.. “దాగుడు మూతలు దండాకోర్” అంటూ సంక్రాంతికి?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!