సిద్దిపేట శివారు మందపల్లి నుంచి రైల్వే ట్రాక్ లైన్ పనులను రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైలు త్వరితగతిన సిద్దిపేటకు చేరుకునేలా రైల్వే ట్రాక్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రైల్వే శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.
Harish Rao: మత్స్యశాఖ అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మూగజీవాలకు కూడా విస్తృత సేవలు అందుతున్నాయన్నారు.
బీజేపీ హఠావో-దేశ్ కీ బచావో అనే నినాదంతో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజాచైతన్య యాత్ర నిర్వహిస్తోంది. చేర్యాల, కొమురవెళ్లి మండలాల్లో నిర్వహిస్తున్న ప్రజా చైతన్యయాత్రలో జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
Stray dog attack on Deputy Collector Srinivas Reddy: కుక్కకాటు ఘటనలు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్‌లో ఓ చిన్నారిని వీధికుక్కలు కరిచిన ఘటనతోపాటు ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వచ్చి భయాందోళనకు గురిచేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే చిన్నారులు, వృద్ధులు, సామాన్యులే కాదు అధికారులు సైతం కుక్కకాటుకు గురవుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అలాంటి ఘటనే సిద్దిపేట కలెక్టరేట్‌లో చోటుచేసుకుంది. కానీ ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి…
లోన్ యాప్ పేరిటి మోసాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నగరంలో వెలుగు చూస్తున్న మోసాలు ఇప్పుడు జిల్లాలకు పాకింది. లోన్ మంజూరు అయ్యిందంటూ ఫోన్ చేయడం వారి ఖాతాలో వున్న డబ్బులను ఖాలీ చేస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. ఇలాంటి ఘటనే సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లో చోటుచేసుకుంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ 69 జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్ సంబరాలు నిర్వహిస్తుంది. కేసీఆర్ పెట్టిన రోజు సందర్భంగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈనేపథ్యంలో.. సిద్దిపేట జిల్లా మంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సీఎం కేసీఆర్ 69వ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్ని కేక్ కట్ చేసిన శుభాకాంక్షలు తెలియజేశారు.
Komuravelli Mallanna: కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన మల్లన్న కల్యాణ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. కేతమ్మ, మేడల దేవి సమేత మల్లికార్జున స్వామి వారి కల్యాణానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కొమురవెల్లి మల్లన్న జాతరలో భాగంగా మంత్రి హరీశ్ రావు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కోటి రూపాయల విలువైన బంగారు కిరీటాన్ని సమర్పించారు.…
కాళేశ్వరం ఫలితంగా ఆయిల్ ఫామ్ సాగుచేసే రైతుకు మేలు జరుగుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలోని నారాయణరావుపేట మండలం బంజరుపల్లి గ్రామంలో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు. ఆయిల్ ఫామ్ సాగుతో అధిక దిగుబడి, అధిక ఆదాయం వస్తుందని పేర్కొన్నారు.
దళిత బందులో కూడా జర్నలిస్ట్ లకు అవకాశం కల్పిస్తామని మంత్రి హరీష్ రావు శుభవార్త చెప్పారు. సిద్దిపేట జిల్లాలో లబ్ధిదారులకు డబుల్ బెడ్ ఇండ్ల పట్టాలు మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. పేద ప్రజల కోసం సీఎం కేసీఆర్ రూపాయి ఖర్చు లేకుండా సకల సౌకర్యాలతో డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తున్నారని పేర్కొన్నారు.