Stray dog attack on Deputy Collector Srinivas Reddy: కుక్కకాటు ఘటనలు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్‌లో ఓ చిన్నారిని వీధికుక్కలు కరిచిన ఘటనతోపాటు ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వచ్చి భయాందోళనకు గురిచేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే చిన్నారులు, వృద్ధులు, సామాన్యులే కాదు అధికారులు సైతం కుక్కకాటుకు గురవుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అలాంటి ఘటనే సిద్దిపేట కలెక్టరేట్‌లో చోటుచేసుకుంది. కానీ ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అధికారులు కూడా భయాందోళనకు గురవతున్నారు.
Read also: Prabhas: అన్నపూర్ణ స్టూడియోలో టెర్రస్ ఎక్కిన పాన్ ఇండియా స్టార్
సిద్దిపేట కలెక్టరేట్ క్వార్టర్స్ లో కుక్కల భీభత్సం సృష్టించాయి. నగర శివారులో సిద్దిపేట కలెక్టరేట్ ఉంది. కలెక్టరేట్‌తో పాటు అధికారుల నివాసాలు ఉన్నాయి. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కూడా ఆ నివాసాల్లోనే ఉంటున్నారు. శనివారం రాత్రి తన క్వార్టర్ ఆవరణలో నడుచుకుంటూ వెళ్తున్నారు. క్వార్టర్స్ ఆవరణలో వాకింగ్ చేస్తున్న డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని ఎక్కడి నుంచో ఓ వీధికుక్క వచ్చి గట్టిగా కరిచింది. . శ్రీనివాస్ తప్పించుకునే ప్రయత్నం చేసిన ఆ కుక్క వదల్లేదు డిప్యూటీ కలెక్టర్ రెండు కాళ్ళను కొరికేసింది. దీంతో డిప్యూటీ కలెక్టర్ గట్టిగా కేకలు వేయండో అక్కడున్న సిబ్బంది చేరుకుని కుక్కను తరిమారు. దీంతో డిప్యూటీ కలెక్టర్ ప్రాణాలకు ఎటువంటి హాని జరగలేదు. కానీ.. రెండు కాళ్ల పిక్కల మధ్యల కరవడంతో తీవ్ర గాయాలు, రక్తస్రావం కావడంతో.. సిబ్బంది హుటాహుటిన డిప్యూటీ కలెక్టర్ ను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు డిప్యూటీ కలెక్టర్ కు మెరుగైన వైద్యం అందించి ఇంటికి పంపారు. సమీపంలో ఉన్న ఓ బాలున్ని, డిప్యూటీ కలెక్టర్ పెంపుడు కుక్కపై కూడా వీధికుక్క దాడి చేయండంతో అధికారులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన జరిగి రెండు రోజులు అవుతున్న ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అధికారులు షాక్ కు గురయ్యారు.
Washing Machine Bursts : తృటిలో తప్పిన ప్రాణాపాయం