సికింద్రాబాద్ లో కిడ్నాప్ అయిన చిన్నారి కథ సుఖాంతం అయిన సంగతి తెలిసిందే. ఆ పాపను పోలీసులు సైకో రాము నుంచి క్షేమంగా కాపాడి తల్లి ఒడికి చేర్చారు. చిన్నారి కృతికను మహంకాళి పోలీసులు క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. తమ పాపను క్షేమంగా తీసుకొచ్చిన పోలీసులకు కృతిక పేరెంట్స్ కృతజ్ఞతలు తెలిపారు. నిన్న ఉదయం మహంకాళి ఆలయం వద్ద చిన్నారి కృతికను ఎవరో అపరిచిత వ్యక్తి తీసికెళ్లిపోయాడు. పాప కిడ్నాప్ అయిందని పోలీసులకు కంప్లైంట్ చేశారు తల్లిదండ్రులు. పాపను ఎత్తుకెళ్ళిన సైకో రాము తన స్వస్థలమైన సిద్దిపేట జిల్లా దూల్ మిట్టకు తరలించాడు. అక్కడ గ్రామస్తులకు అనుమానం వచ్చి పాపను విచారించగా అసలు విషయం బయటపడింది. గ్రామస్తులు వెంటనే సర్పంచ్ కు సమాచారం ఇచ్చారు.
వెంటనే సిద్దిపేట పోలీసులను అప్రమత్తం చేశారు. హుటాహుటిన రంగంలోకి దిగిన సిద్ధిపేట పోలీసులు.. సైకోను అదుపులోకి తీసుకుని పాప కృతికను రక్షించారు. పాప చెవి దుద్దులను కిడ్నాపర్ పట్టుకెళ్లాడు. పాపను రక్షించిన పోలీసులు.. సికింద్రాబాద్ నార్త్ జోన్ డీసీపీ చందన దీప్తికి సమాచారం ఇచ్చారు. పాప కిడ్నాప్ కేసులో సైకో రాముని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఉదయం 11 గంటలకు చిన్నారి కృతిక మిస్సింగ్ అయినట్లు ఫిర్యాదు వచ్చిందని, 6 ఏళ్ల కృతిక ను అవ్వ ఇంట్లో వదిలేసి వచ్చారు.. అక్కడ మిస్ అయినట్లు ఫిర్యాదు అందిందని డీసీపీ చందనదీప్తి తెలిపారు. కృతిక అవ్వ బిల్డింగ్ వద్ద హోటల్ లో పని చేసే వ్యక్తి బాలిక ను తీసుకొని పోయాడని తెలిపారన్నారు. బాలిక ను ఆటో లో ఎక్కించుకొని వెళ్ళాడని, జేబీఎస్ నుంచి సిద్దిపేట వెళ్లినట్టు తెలిపారు.
Read Also: Shyam Singha Roy: నాని మాస్టర్ పీస్ కి వన్ ఇయర్…
చిన్నారి మిస్సింగ్ కేసును ఛాలెంజింగ్ గా తీసుకొని కేసును ఛేదించామన్నారు. సీసీ కెమెరా ఆధారంగా 7 గంటల్లో కేసును ఛేదించామన్నారు. సిద్ధి పేట్ లో సైకో రాము ఉంటాడని, మద్యం మత్తులో ఉంటాడని స్థానికులనుండి సమాచారం వచ్చింది, అక్కడ స్థానికులు పాప ఎవరు అని ప్రశ్నిస్తే , మా అన్న కూతురు అని అబద్ధం చెప్పాడు. పాప చెవి కమ్మలు తీసుకొని రూ.2500కి సైకో రాము అమ్మేశాడు. బిస్కెట్లు కొనిచ్చి అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడన్నారు. చిన్నారి స్టేట్మెంట్ రికార్డ్ చేశామని, అమ్మాయి పై అటాక్ ఏమైనా జరిగిందా అనేది ఇంకా దర్యాప్తు చేస్తున్నాం అన్నారు. పాప క్షేమంగా తల్లిచెంతకు చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Read Also: Central Government: పేదలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. మరో ఏడాది పాటు ఉచిత రేషన్