సిద్దిపేటలో ఆదర్శ్ నగర్ స్ట్రీట్ నంబర్ 7 లో దారుణం చోటుచేసుకుంది. భార్య శ్రీలతపై అనుమానంతో భర్త ఎల్లయ్య కత్తితో పొడిచి చంపాడు. భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, పిల్లలు కూడా తనకి పుట్టలేదన్న అనుమానంతో ఘాతుకానికి పాల్పడ్డాడు. భార్య శ్రీలత(35) ని కత్తితో పొడిచి చంపిన భర్త ఎల్లయ్య.. అనంతరం కూతురు(15), కొడుకు(12)పై కత్తితో దాడికి యత్నించాడు. తండ్రి దాడిలో తప్పించుకుని పారిపోయిన కుమారుడు. అనంతరం గడ్డి మందు తాగి కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు…
రోజురోజుకు మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ఆస్తుల కోసం అయినవారిని అంతమొందిస్తున్నారు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని మళ్లీ మళ్లీ నిరూపిస్తు్న్నారు. తాజాగా సిద్ధిపేట జిల్లా కొండపాక (మం) తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం చిన్నల్లుడు అత్తను హత్య చేశాడు. భర్త చనిపోవడంతో ఇద్దరు కూతుళ్లకు పెళ్లి చేసి ఒంటరిగా ఉంటున్న రాములమ్మ ( 55). ఆరు నెలల క్రితం తన పేరుపై ఉన్న రెండున్నర ఎకరాల భూమిని ఇద్దరు కూతుళ్లకి సమానంగా పంచుతానని…
డీసీసీ ప్రకటనతో ఆ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అగ్గి రాజుకుందా..? ప్రత్యర్థి వర్గానికి పదవి దక్కకుండా ఆ మాజీ ఎమ్మెల్యే వేసిన స్కెచ్ వర్కౌట్ అవలేదా? ప్రతిపక్షం బలంగా ఉన్న జిల్లాలో అధికార పార్టీ గ్రూపు గోల ఏ మలుపు తిరగబోతోంది? ఎక్కడ జరుగుతోందా పంచాయితీ? సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంతమాత్రమే. కానీ… గ్రూప్ వార్ మాత్రం వీధిన పడి తన్నుకుంటూ…..పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కే స్థాయిలో ఉంది. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి,…
Siddipet Taravva : సిద్దిపేట జిల్లాలో తారవ్వ అనే మహిళా రైతు పంట నష్టపోయిందంటూ కలెక్టర్ కాళ్లు పట్టుకున్న ఘటనపై సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెంటనే స్పందించారు. ఈ సంఘటన మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో కమిషనర్ తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు తారవ్వ పంటను పూర్తిగా కొనుగోలు చేశారు. అంతేకాకుండా తారవ్వ అకౌంట్‌లో పంట మొత్తాన్ని కూడా డిపాజిట్ చేశారు. కేవలం…
Husnabad : మొంథా తుఫాన్ నిండా ముంచింది. రైతులకు చేతికొచ్చిన పంటను సర్వనాశనం చేసింది. ఇంకో రెండు రోజులైతే అమ్ముకుందాం.. డబ్బులొస్తాయి అని మురిసిన రైతుల నోట్లో మట్టి కొట్టింది. ఆరుగాళం కష్టపడి రక్తం దారబోసి పంట పండిస్తే.. ఒక్క గింజ కూడా మిగల్చకుండా ఊడ్చుకుపోయింది. ఎటు చూసినా రైతుల కన్నీళ్లే.. గుండెలు పిండేసే బాధలే.. ఈ హృదయవిదారకర ఘటన హుస్నాబాద్ మార్కెట్ యార్డులో కనిపించింది. భీకర వర్షానికి మార్కెట్ యార్డులోకి భారీగా వాన నీళ్లు వచ్చి…
Viral : సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం దొమ్మాట గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలో మొత్తం 36 మంది విద్యార్థులు ఉండగా, వారిని బోధించేందుకు కేవలం ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే వారిలో ఒకరు డిప్యూటేషన్ పై మరో పాఠశాలకు వెళ్లడంతో ప్రస్తుతం ఇద్దరు ఉపాధ్యాయులతోనే బోధన కొనసాగుతోంది. The Raja Saab: బర్త్ డే స్పెషల్..‘రాజా సాబ్‘ నుంచి.. ప్రభాస్ స్పెషల్ పోస్టర్ రిలీజ్…
సిద్దిపేట జిల్లా ములుగులో దారుణం వెలుగుచూసింది. పెళ్లైన 13 రోజులకే ఓ యువతి గర్భం దాల్చింది. భర్త నిలదీయడంతో అసలు విషయం వెలుగుచూసింది. ఘటనలో సినిమా రేంజ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆ యువతికి పెళ్లికి ముందే ఉదయ్ కిరణ్ అనే యువకుడితో ప్రేమ వ్యవహారం ఉంది. ప్రేమ పేరుతో యువతిని శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ విషయం తెలిసిన మరో యువకుడు పవన్ కళ్యాణ్ యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. Also Read: Andhra Pradesh : ఏపీలో…
MLM : సిద్దిపేట జిల్లాలో మల్టీ లెవెల్ చైన్ ఫైనాన్స్ కంపెనీ క్యూనెట్ మోసానికి ఒక యువకుడు బలయ్యాడు. వర్గల్ మండలం వేలూరులో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వేలూరు గ్రామానికి చెందిన హరికృష్ణ (26) అనే యువకుడు ఇటీవల ఒక స్నేహితుడి సూచన మేరకు క్యూనెట్ కంపెనీలో చేరాడు. కంపెనీ ప్రతినిధులు 4 లక్షల రూపాయలు చెల్లిస్తే ప్రతి నెల 15 వేల రూపాయలు రెగ్యులర్‌గా వస్తాయని హామీ ఇచ్చారు. ఆ మాటలు…
Local Body Elections : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ఉత్సాహంగా సాగుతున్నాయి. మొత్తం 16 జడ్పీటీసీ, 103 ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే అన్ని జిల్లాల్లో రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. పార్టీ నాయకులు, అభ్యర్థులు నామినేషన్లు వేయడంలో పోటీ పడుతున్నారు. జడ్పీటీసీ స్థానాల విషయానికి వస్తే, సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా 7 నామినేషన్లు దాఖలు…
ఈజీమనీకి అలవాటు పడిన కొందరు దొంగనోట్ల ముద్రణకు తెరలేపుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా చలామణికి పాల్పడుతున్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలని, కోటీశ్వరులం అయిపోవాలని నకిలీ నోట్లను తయారు చేస్తున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలో దొంగనోట్లు తీవ్ర కలకలం రేపాయి. ఒకే నంబర్ తో కూడిన రూ. 200 నోట్లు ప్రత్యక్షం కావడంతో అంతా షాక్ కు గురయ్యారు. కూరగాయలు అమ్మే వృద్దులే టార్గెట్ గా దొంగ నోట్ల చెలామణికి పాల్పడుతోంది ముఠా. ఒకే…