Minister Harish rao: సిద్దిపేట శివారు మందపల్లి నుంచి రైల్వే ట్రాక్ లైన్ పనులను రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైలు త్వరితగతిన సిద్దిపేటకు చేరుకునేలా రైల్వే ట్రాక్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రైల్వే శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. సిద్దిపేట రైల్వే ట్రాక్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రైల్వే శాఖ అధికారులు కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. దుద్దెడ నుంచి సిద్దిపేట వరకు రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల్లో భాగంగా చేపట్టిన ట్రాక్ నిర్మాణ పనులను రైల్వే అధికారులు మంత్రికి వివరించారు. దుద్దెడ-సిద్దిపేట రైల్వే ట్రాక్ పనుల్లో భాగంగా మందపల్లి వద్ద అండర్‌పాస్ వంతెన నిర్మాణంలో జాప్యంపై మంత్రి హరీశ్‌రావు ఆరా తీసి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని రైల్వేశాఖ అధికారులను ఆదేశించారు.
Read also: Mahesh: ఏ ఫాన్స్ కోసం వదిలేసాడో… ఆ ఫాన్స్ కోసమే మళ్లీ మొదలుపెట్టాడు
మనోహరాబాద్-కొట్లపల్లి రైల్వేలైన్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ మొత్తం వ్యయంలో మూడింట ఒక వంతు భరించాలన్న ఒప్పందం మేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.500 కోట్లు ఖర్చు చేశామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. 2,200 ఎకరాల భూసేకరణ పూర్తయింది. ఇంకా 300 నుంచి 350 ఎకరాల భూసేకరణ పూర్తి చేయాల్సి ఉందన్నారు. అందులో మెదక్ జిల్లాలో 171 ఎకరాలు, సిద్దిపేట జిల్లాలో 1342 ఎకరాలు, సిరిసిల్ల జిల్లాలో 708 ఎకరాలు భూసేకరణకు అయ్యే మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించి సేకరించింది. మెదక్ జిల్లా పరికిబండ వద్ద భూసేకరణకు అటవీ అనుమతుల సమస్య ఉంటే అందుకు అవసరమైన నిధులు వెచ్చించి క్లియర్ చేశామన్నారు. మనోహరాబాద్ వద్ద జాతీయ రహదారి ఆర్‌వోబీ నిర్మాణానికి ఇబ్బంది ఉంటే ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి ఢిల్లీలో పనులు పూర్తి చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రైల్వేకు మరో రూ.100 కోట్లు మంజూరు చేస్తామన్నారు.
రైల్వేకు అందించిన రూ.500 కోట్లతో పాటు కుకునూరుపల్లి, మందపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, మిషన్ భగీరథ పైపులైన్ల మార్పు, సాగునీటి కాలువల మరమ్మతులు, కాళేశ్వరం ప్రాజెక్టు టన్నెల్, ఆడిట్‌ల మార్పు, విద్యుత్తు మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు వెచ్చించింది. టవర్లు మరియు బిల్డింగ్ అప్రోచ్ రోడ్లు. రైల్వేలైన్ నిర్మాణం వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలు అవసరమైన స్థలాల్లో ఇళ్లు, ప్లాట్లు నిర్మించుకున్నారని తెలిపారు. రైల్వే శాఖ పనులు వేగవంతం చేసి పగలు, రాత్రి పనులు నిర్వహించి త్వరగా నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఈ రైలు మార్గం నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత ప్రజల రాకపోకలకు మార్గం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ రైలు మార్గంలో గూడ్స్ మరియు ప్యాసింజర్ రైళ్లు నడుస్తాయి. భవిష్యత్తులో, ఈ లైన్ నార్త్ మరియు సౌత్ యొక్క ముఖ్యమైన రైల్వే మార్గంగా అభివృద్ధి చెందుతుంది. దాదాపు 75 కి.మీ దూరం తగ్గుతుందని తెలిపారు. రైల్వేలైన్ నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా జిల్లా యంత్రాంగం సహకరించేందుకు సిద్ధంగా ఉందన్నారు.
Mahesh: ఏ ఫాన్స్ కోసం వదిలేసాడో… ఆ ఫాన్స్ కోసమే మళ్లీ మొదలుపెట్టాడు