వైద్యంలో తెలంగాణ దేశంలో మూడో స్థానంలో ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. చివరి స్థానంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉందని విమర్శించారు. డబుల్ ఇంజిన్ ఒక పెద్ద ట్రబుల్ ఇంజిన్ అంటూ మండిపడ్డారు.
సిద్దిపేట జిల్లా కొండపాకలో శ్రీ సత్యసాయి సంజీవని బాలల గుండె చికిత్స, పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల మంత్రి హరీశ్ రావు ఆనందం వ్యక్తంచేశారు. ఇక.. కొండపాకలో కొత్తగా నిర్మించిన శ్రీ సత్యసాయి సంజీవని బాలల గుండె చికిత్స, పరిశోధన కేంద్రాన్ని సద్గురు మధుసూదన్‌సాయితో కలిసి మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.
కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. ఎక్కడో ఢిల్లీలోనో, హైదరాబాద్ గాంధీభవన్ లోనో కూర్చుని మాటలు మాట్లాడుతున్న నేతలకు తెలంగాణలో నీళ్లు అందుతున్నాయా? లేదా ? అనే విషయం వాళ్లకేం తెలుసని ప్రశ్నించారు.
Siddipet Car Accident: సిద్దిపేట జిల్లాలో జరిగిన కారు ప్రమాదం విషాదం మిగిల్చింది. కొండపాక మండలం జప్తి నాచారం శివారులో ఓ కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. బావిలో పడ్డ కారులో ముగ్గురు వ్యక్తులు ఉండగా.. ఇద్దరు ప్రాణాలతో బయటపడగా మరొకరు కారులోనే ఇరుక్కుపోయి చనిపోయారు. బావిలో పడ్డ కారు, యాదగిరి కోసం ఆరుగంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. సిద్దిపేట జిల్లా సిరిసినగండ్లకు చెందిన వెంకటస్వామి తన బావలను ఇంటికి తీసుకురావడానికి కారు తీసుకుని కొండపాకకి బయలుదేరాడు.…
సకల జనుల సమ్మెతో ఢిల్లీని గడగడలాడించి తెలంగాణ సాధించామని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట హై స్కూల్ గ్రౌండ్ లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల బహిరంగ సభలో ఆయన మట్లాడారు. ఈ మధ్య కొన్ని శక్తులు కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నాయని అన్నారు. మతాల పేరిట విద్వేషాలు రెచ్చగొట్టే వారికి అధికారం పోతే అభివృద్ధి కుంటు పడుతుందని మండిపడ్డారు. హైదరాబాద్, ఢిల్లీ కేంద్రంగా మాట్లాడే కొంతమంది…
Telangana: ప్రజల కోసం ఇప్పటికే ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న తెలంగాణ రాష్ట్ర (సమితి) ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. ఆ పథకానికి ఇంకా పేరు పెట్టలేదు. బహుశా "కార్మికబంధు" అనే పేరు పెట్టొచ్చని భావిస్తున్నారు.
అభివృద్ధి, సంక్షేమ పనులన్నింటినీ సిద్దిపేటకే తీసుకెళ్తావని తనని తిడతారని.. కానీ వేరే విషయంలో తనను ఏమీ అనరని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట ప్రజలు తన కుటుంబసభ్యులతో సమానమని మంత్రి వెల్లడించారు. సిద్దిపేట పట్టణంలో కొండ భూదేవి గార్డెన్లో ఏర్పాటు చేసిన భవన నిర్మాణ కార్మికుల జిల్లా సదస్సుకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. సొంత ఇంటి స్థలం ఉన్నవారికి రూ.3 లక్షలు మంజూరు చేస్తామని అన్నారు. నేడు (బుధవారం) సిద్దిపేట పట్టణంలోని 14వ వార్డులో ఫుట్ పాత్ నిర్మాణం,14వ వార్డు ముస్తాబాద్ సర్కిల్ నుంచి ఛత్రపతి శివాజీ సర్కిల్ వరకూ రూ.1.20 కోట్లతో నిర్మిస్తున్న వరద కాలువ, డ్రైనేజీ, ఫుట్ పాత్ నిర్మాణ పనులకు మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. సిద్దిపేటను…
తొలి ప్రయత్నంలోనే ఐఎఫ్ఎస్ -2021లో 86వ ర్యాంకు సాధించిన సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్సీఆర్ఐ) విద్యార్థి కాసర్ల రాజును మంగళవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అభినందించారు. రాజు స్ఫూర్తితో కళాశాల నుంచి మరింతమంది విద్యార్థులు ఇలాంటి ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. జనగాం జిల్లా సూరారం గ్రామంలో కాసర్ల రాజు చెందినవాడు. అతను గత సంవత్సరం బీఎస్సీ ఫారెస్ట్రీ పూర్తి చేసాడు. ప్రస్తుతం అతను ‘ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చి ఇనిస్టిట్యూట్…