Bride Groom Died With Current Shock In Siddipet: అంగరంగ వైభవంగా రెండు రోజుల క్రితం పెళ్లి జరిగింది. బంధువులు, స్నేహితులతో ఆ ఇళ్లు కలకలలాడింది. ఆ వధువు కూడా ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టింది. అయితే కరెంట్ షాక్ రూపంలో మృత్యువు ఆ కుటుంబాన్ని కన్నీటిలో ముంచేసింది. వధువు నుదిటి కుంకుమ చెరిపేసింది. ఆమె ఆశలను తుంచేసింది. రిసెప్షన్ రోజే వరుడు విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. Also Read: Viral Video:…
సిద్దిపేటలో మెగా డ్రోన్ షో నిర్వహించారు. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో డ్రోన్ షోను ఏర్పాటు చేశారు. కోమటి చెరువు వేదికగా 450 డ్రోన్ లతో కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మంత్రులు హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగాగా హాజరై.. షోను తిలకించారు.
Harish Rao: మంత్రి హరీష్ రావు నేడు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సాయంత్రం కోమటి చెరువులో దాదాపు 4500 డ్రోన్లతో డ్రోన్ షో నిర్వహణ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొననున్నారు.
సిద్దిపేట జిల్లాలో లోన్ యాప్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. లోన్ తీసుకున్న వారికి న్యూడ్ ఫోటోలు పంపి బెదిరింపులకు దిగుతున్నారు. కుకునూర్ పల్లిలో ఆన్ లైన్ యాప్ నుంచి ఓ వ్యక్తి లోన్ తీసుకున్నాడు. తీసుకున్న లోన్ మొత్తం చెల్లించిన ఇంకా నగదు చెల్లించాలని ఫోన్ చేసి లోన్ యాప్ నిర్వహకులు బెదిరిస్తున్నట్లు పేర్కొన్నారు. లేకపోతే న్యూడ్ ఫోటోలు బంధువులకు పంపి సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరించినట్లు బాధితుడు తెలిపాడు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో హాఫ్ మారథాన్ రన్ ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. కాగా.. సిద్దిపేటలో నిర్వహించిన హాఫ్ మారథాన్ కి అపూర్వ స్పందన వచ్చింది.
Chikoti Praveen: క్యాసినో వ్యవహారంలో చీకోటి ప్రవీణ్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. ఇప్పుడు మరోసారి తెరపైకి చీకోటి ప్రవీణ్ రావడంతో హాట్ టాపిగ్ గా మారింది.
Harishrao-KTR: సిద్దిపేటలో మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రం సమీపంలోని నాగులబండలో రూ.63 కోట్ల వ్యయంతో నిర్మించిన ఐటీ హబ్ను మంత్రి హరీష్ రావుతో కలిసి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
సిద్దిపేట జిల్లాలో అప్పుడే పుట్టిన శిశు విక్రయం కలకలం రేపుతుంది. సిద్దిపేట అర్బన్ (మం) బూర్గుపల్లి గ్రామ శివారులో నిన్న ఉదయం పుట్టిన పసికందును 20 వేలకు విక్రయించే ప్రయత్నం చేసారు తల్లిదండ్రులు. గజ్వేల్ కి చెందిన ఓ కుటుంబంతో విక్రయ ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం తెలుస్తోంది. విషయం తెలుసుకున్న బాల రక్షక్ అధికారులు శిశు విక్రయాన్ని అడ్డుకున్నారు.
ప్రపంచంలోనే తొలి త్రీడీ ప్రింటెడ్ టెంపుల్ తో తెలంగాణ మరో అరుదైన ఘనతను సాధించనుంది. హైదరాబాద్ కు చెందిన నిర్మాణ సంస్థ అప్సుజా ఇన్ఫ్రాటెక్, సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ భాగస్వామ్యంతో ఈ కాంప్లెక్స్ ను నిర్మిస్తున్నారు.