ప్రపంచంలోనే తొలి త్రీడీ ప్రింటెడ్ టెంపుల్ తో తెలంగాణ మరో అరుదైన ఘనతను సాధించనుంది. హైదరాబాద్ కు చెందిన నిర్మాణ సంస్థ అప్సుజా ఇన్‌ఫ్రాటెక్, సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ భాగస్వామ్యంతో ఈ కాంప్లెక్స్ ను నిర్మిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలోని బూరుగుపల్లిలోని గేటెడ్ విల్లా కమ్యూనిటీ అయిన చార్వితా మెడోస్ పరిధిలో 3,3800 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు భాగాలుగా ఈ బిల్డింగ్ ను నిర్మిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ఒక రోజు ముందు ఈ వార్త రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : Green Deposits: గ్రీన్ డిపాజిట్లు అంటే ఏంటి ? జూన్ 1 నుండి అమలు కానున్న కొత్త ఫ్రేమ్‌వర్క్ ఏమిటి?
ఇక ఈ త్రీడీ ఆలయ నిర్మాణానికి ఉపయోగించే త్రీడీ టెక్నాలజీని దేశీయంగా అభివృద్ధి చేసింది. ఈ ఆలయంలో మోదక్, శివుడికి అంకితం చేసిన చతురస్రాకార నివాసం, పార్వతి దేవికి తామర ఆకారంలో ఉన్న మూడు గర్భగుడిలు ఉంటాయని అప్సుజా ఇన్‌ఫ్రాటెక్ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. శివాలయం, మోదక్ పూర్తవడంతో కమలం, ఎత్తైన గోపురాలతో కూడిన రెండో దశ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.
Also Read : Maharashtra: మహారాష్ట్రలో వింత ఘటన.. కార్పెట్‌పై తారు రోడ్డు..
ఈ త్రీడీ కట్టడంలో మూడు గర్భాలయాలు ఉంటాయి. మోదక్ ఆకారంలోనిది గణేశుడికి, దీర్ఘచతురస్రాకార ఆలయం శివుడికి, కమలం ఆకారంలోనిది పార్వతి దేవి కోసం నిర్మిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. డోమ్ ఆకారంలో ఉన్న మోదక్ ను 10 రోజుల వ్యవధిలో ముద్రించడానికి కేవలం ఆరు గంటల టైమ్ మాత్రమే పట్టిందని సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ సీఈఓ తెలిపారు. ఇక ఈ త్రీడి టెంపుల్ నిర్మాణంతో తెలంగాణలో మరో అద్భుతమైన టెక్నాలజీని ఉపయోగించి నిర్మాణంగా గుర్తింపు పొందుతుంది.