Harish Rao: తెలంగాణ సీఎం కేసీఆర్ 69 జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్ సంబరాలు నిర్వహిస్తుంది. కేసీఆర్ పెట్టిన రోజు సందర్భంగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈనేపథ్యంలో.. సిద్దిపేట జిల్లా మంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సీఎం కేసీఆర్ 69వ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్ని కేక్ కట్ చేసిన శుభాకాంక్షలు తెలియజేశారు. CM బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలు, ఉద్యమ కారుల మధ్య నేడు సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు నివహిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రజల పక్షాళన కేసీఆర్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.
Read also: Vemulawada: రాజన్న ఆలయంలో మహా శివారాత్రి ఉత్సవాలు.. ఆరోజు నిర్వహించే పూజలివే..
కేసీఆర్ ఈ మట్టి బిడ్డ కావడం గర్వకారణమన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన కారణ జన్ముడు కేసీఆర్ అన్నారు. కానే కాదు.. రానే రాదు అన్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించాడని పేర్కొన్నారు. రైతు బందు, బీమా పథకాలు దేశానికి ఆదర్శమన్నారు. తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవంతో బ్రతికేలా కేసీఆర్ కృషి చేశారని కొనియాడారు. 65వేల కోట్లు రైతు బందు కోసం బడ్జెట్ లో పెట్టారు కేసీఆర్ అని తెలిపారు. అభివృద్ధి లో.. సంక్షేమం లో తెలంగాణ ను కేసీఆర్ ముందుచాడని అన్నారు. కేసీఆర్ ఎంత ఎదిగితే తెలంగాణకు అంతలాభమని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఒక చెట్టుకింద అరుగుపై సీఎం కేసీఆర్‌తో హరీష్ రావు కూర్చన్న ఫోటోను షేర్ చేస్తూ గత స్మృతులు పంచుకున్నారు.
హరీష్ రావు ట్విట్టర్ ..
* సిద్దిపేట సిగలో వెలుగులు నింపిన పున్నమి చంద్రుడు..
* తెలంగాణ ప్రజలకు స్వేఛ్చా వాయువులు ప్రసాదించిన శేఖరుడు..
* కాళేశ్వర గంగను దివి నుంచి భువికి దించిన అపర భగీరథుడు..
* తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా మార్చిన రైతుబాంధవుడు..
* అద్భుత పాలనతో దేశాన్ని ఆలోచింపచేస్తున్న అనితరసాధ్యుడు
కేసీఆర్ అంటే కారణజన్ముడుగా… చిరస్మరణీయుడుగ ప్రజల తల రాతలను మార్చే మహనీయుడుగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలి.. !! అంటూ మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
❇️సిద్దిపేట సిగలో వెలుగులు నింపిన పున్నమి చంద్రుడు..
❇️తెలంగాణ ప్రజలకు స్వేఛ్చా వాయువులు ప్రసాదించిన శేఖరుడు..
❇️కాళేశ్వర గంగను దివి నుంచి భువికి దించిన అపర భగీరథుడు..
❇️తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా మార్చిన రైతుబాంధవుడు..
❇️అద్భుత పాలనతో దేశాన్ని ఆలోచింపచేస్తున్న అనితరసాధ్యుడు
1/2 pic.twitter.com/qmm4vMBji1— Harish Rao Thanneeru (@BRSHarish) February 17, 2023
Etela Rajender: జైలు నుండి విడుదలైన కమలాపూర్ బీజేపీ నాయకులు.. ఈటెల ఘన స్వాగతం