Harish Rao: కేంద్ర మంత్రులు తెలంగాణను ఢిల్లీలో మెచ్చుకుంటారు.. గల్లీలో తిడుతున్నారని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. మత్స్యశాఖ అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మూగజీవాలకు కూడా విస్తృత సేవలు అందుతున్నాయన్నారు. తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతున్నారని విమర్శించారు. సిద్దిపేటలో పీవీ నర్సింహారావు వెటర్నరీ కళాశాల నిర్మాణానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. అనంతరంఆయన మాట్లాడుతూ సిద్దిపేట వెటర్నరీ కళాశాలకు వచ్చిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. పీవీ ఘాట్ నిర్మాణానికి కాంగ్రెస్ అనుమతి ఇవ్వలేదని, పీవీ ఆస్పత్రికి పేరు పెట్టి గౌరవం పెంచిన ఘనత సీఎం కేసీఆర్ అని వెల్లడించారు. కాళోజీ, కొండా లక్ష్మణ్‌బాపూజీ పేర్లతో విశ్వవిద్యాలయాలు స్థాపించారు. కాళేశ్వరంతో ఎండాకాలంలోనూ జలసిరి పండించి విక్రయిస్తామన్నారు. సిద్దిపేట జిల్లాలో 12,460 మంది మత్స్యకారులకు కొత్త సభ్యత్వం ఇచ్చారు. 3.70 లక్షల మందికి రెండో విడుత గొర్రెలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
Read also: Carden search: మాదాపూర్ లో కార్డెన్ సెర్చ్.. 400 కాటన్స్ మద్యం బాటిళ్ళు సీజ్
సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామీణ వ్యవస్థ బాగుపడిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు 24 గంటల కరెంటు ఇస్తున్నామన్నారు. తెలంగాణ అభివృద్ధి ప్రతిపక్షాలకు కనిపించడం లేదన్నారు. మత్స్యకార సొసైటీల్లో 3.72 లక్షల మంది సభ్యులుగా ఉన్నారని వెల్లడించారు. మరో లక్ష మందికి సభ్యత్వం ఇస్తున్నామని తెలిపారు. ఈ నెలాఖరులోగా రెండో విడత గొర్రెల పంపిణీ జరగనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిద్దిపేటలో నాలుగో వెటర్నరీ కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో పెరిగిన జంతువుల సంఖ్యకు అనుగుణంగా కొత్త పశువైద్యులకు శిక్షణ ఇచ్చేందుకు వెటర్నరీ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కులవృత్తుల కార్మికులను ప్రోత్సహిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. మత్స్యకారులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తలసాని అన్నారు.
PM Modi: బెంగళూర్‌లో రెండో రోజు ప్రధాని మెగా రోడ్ షో..