ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్, మణికొండ, సికింద్రాబాద్, కూకట్ పల్లి, లక్డీకపూల్, మెహిదీపట్నంలో భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షం కారణంగా నగర పరిసరాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఉదయం పూట పరిశ్రమలు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఇచ్చిన హామీల విషయంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో.. నేడు రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ పిలుపుమేరకు మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా వీఆర్‌ఏల నిరసన చేపట్టారు.
సంగారెడ్డి జిల్లా లింగంపల్లి గురుకుల పాఠశాలలో దారుణం జరిగింది. వినాయక చవితి రోజున అపశృతి చోటు చేసుకుంది. గణేష్ మండపం కోసం ఏర్పాటు చేస్తున్న సమయంలో విద్యార్థికి కరెంట్ షాక్ తగలడంతో.. అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన విద్యార్థి సాయిగా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. వినాయక చవితి సందర్భంగా మెదక్ జిల్లా టెక్మాల్ మండలం పాపన్న పేట గురుకుల పాఠశాలలో గణేష్ ఉత్సవాలు నిర్వహించేందుకు…