Ys Sharmila: నేడు సంగారెడ్డిలో షర్మిల పాదయాత్ర.. జిన్నారంలో బహిరంగ సభ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగారెడ్డి జిల్లాలో పటాన్ చెరువు నియోజక వర్గంలో 165వరోజు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర కొనసాగతుంది. ఉదయం 10 గంటలకు అందూర్ నైట్ క్యాంప్ నుంచి పాదయాత్ర మొదలు పెట్టనున్న వైఎస్ షర్మిల. జిన్నారం మండల పరిధిలోని మియజిగూడ, సొలక్ పల్లి, దాడిగుడ మీదుగా పాదయాత్ర చేయనున్నారు షర్మిల. ఊట్ల మీదుగా జిన్నారం మండల కేంద్రానికి షర్మిల చేరుకోనున్నారు. సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు జిన్నారంలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సభ అనంతరం మంగంపేట గ్రామం మీదుగా నర్సాపూర్ నియోజక వర్గంలో షర్మిల అడుగుపెట్టనున్నారు. హత్నూర్ మండలం రోయ్యపల్లి గ్రామంలో రాత్రికి బస చేయనున్నారు షర్మిల.
నిన్న సంగారెడ్డి, కంది మండలాల్లో వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగింది. ఈనేపథ్యంలో.. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మండిపడ్డారు. ఆయన కేటీఆర్ కోవర్ట్ అని, ఈ విషయం గాంధీ భవన్ మొత్తం తెలుసని ఆరోపించారు. వైఎస్సార్ తనని పార్టీలోకి పిలిచారని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. అసలు వైఎస్సార్ పార్టీ మారాడా? ఎప్పుడు మారాడు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. వైఎస్సార్ గెలిచిన పార్టీనే కాంగ్రెస్‌లో కలిసిపోయిందన్నారు. ఆ మాత్రం జ్ఞానం లేకుండా జగ్గారెడ్డి మాట్లాడుతున్నారని.. పార్టీలు మారే ఖర్మ వైఎస్సార్‌కి పట్టలేదని కౌంటర్ ఇచ్చారు. ‘నీలా పార్టీలు మారి.. రాజకీయ వ్యభిచారం చేసే సంస్కృతి వైఎస్ఆర్‌ది కాదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Bigg boss 6: అందరి టార్గెట్ ఆమెనే… ఎందుకంటే..?
Also Read
- TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
- Harish Rao : 5,420 కోట్ల 'ట్రూ అప్' భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
- Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
- Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
తాజావార్తలు
-
Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
-
Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!