తెలంగాణలో గత కొంతకాలంగా తగ్గుతూ వస్తున్న కరోనా కేసులు మళ్ళీ పడగ విప్పుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అప్రమత్తం అయింది. విద్యాసంస్థల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అధికారులతో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష జరిపారు. విద్యార్ధులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించా�
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి అస్సలు వదలడం లేదు. కొత్తగా రూపాంతరం చెంది ప్రజలపై దాడులు చేస్తూనే ఉంది. ఇక తాజాగా సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ముత్తంగి గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. 43 మంది విద్యార్థులు,ఒక ఉపాధ్యాయురాలు కరోనా బారిన పడ్డార�
ఆందోల్ క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జమున హేచరిస్ విషయంలో బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపణలను ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జమున హేచరిస్ విషయంలో హైకోర్టు ఆదేశాల ప్రకా రమే ర�
తెలంగాణలో చిరుతలు అలజడి కలిగిస్తున్నాయి. ప్రతి రోజూ ఏదో ఒక జిల్లాలో చిరుతలు నడిరోడ్లపైకి, వ్యవసాయ క్షేత్రాల్లోకి వస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా, కల్హేరు మండలం నగాధర్ శివారులో చిరుత పులి తిరుగుతున్నట్టు రైతులు తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన చిరుత పులి కదల�
సంగారెడ్డి జిల్లాలో దారుణంలో చోటు చేసుకుంది. 7 సంవత్సరాల మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. సంగారెడ్డికి చెందిన బాలికను కిడ్నాప్ చేసి జోగిపేట వైపు బైక్ పై తీసుకు వెళ్లారు కొందరు దుండగులు. శివ్వంపేట కల్లు దుకాణంలో కల్లు సేవించేందుకు బాలికను వెంట తీసుకెళ్లారు ఆగంతకులు. చిన్నారి ఏడుస్తుండడంతో అన
పంపకాల్లో తేడా వస్తే కోపాలొస్తాయి. ఒకరిపై ఒకరు ప్రతీకారం తీర్చుకోవడానికి రకరకాల పన్నాగాలు పన్నుతారు. ప్రస్తుతం ఆ జిల్లాలో ఇదే జరుగుతోందట. ప్రజాప్రతినిధులు, అధికారులు వైరివర్గాలుగా మారి ప్రతికార చర్యలకు దిగుతున్నారట. ఇప్పుడిదే రాజకీయాలను వేడెక్కిస్తోంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఎప్పుడు ఎవరు
సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలో డయాగ్నొస్టిక్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… రెండుకోట్ల యాభై లక్షలు ఒక్కో డయాగ్నోస్టిక్ సెంటర్ కు కేటాయించడం జరిగింది అని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 సెంటర్లను ప్రారంభింఛడం జరిగింది,మరో 16 సెంటర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేయనున్నారు
సంగారెడ్డికి మెడికల్ కాలేజీ ప్రకటించినందుకు చాలా సంతోషమని..ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేసీఆర్ కు కృతజ్ఞతలు అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుండి సంగారెడ్డి మెడికల్ కాలేజీ కోసం తాను పోరాటం చేస్తున్న సంగతి ప్రజలకు తెలుసని.. దాదాపు 10 నియోజకవర్గాల