సంగారెడ్డి జిల్లాలో రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర కొనసాగుతోంది. యువత, వృద్ధులు, రిటైర్డ్ ఆర్మీ అధికారులు రాహుల్ కి సంఘీభావంగా నడుస్తున్నారు. రాహుల్ పాదయాత్రలో పాల్గొన్న రిటైర్డ్ నావి చీఫ్ అడ్మిరల్ రామదాసు పాల్గొన్నారు..
రాహుల్ తో తెలంగాణ నేతల అడుగులు
89 సంవత్సరాల వయసులో సతీ సమేతంగా రాహుల్ తో పాటు నడిచిన అడ్మిరల్ రామదాసు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఒక చిన్నారిని ఎత్తుకుని కాసేపు నడిచారు రాహుల్ గాంధీ. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకున్న రాహుల్ భారత్ జోడో యాత్రలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో యాత్రకి టీ బ్రేక్ పడింది. సంగారెడ్డి లోని ఓ హోటల్ లో చాయ్ తాగిన రాహుల్ గాంధీ అక్కడ యువత, స్థానికులతో ముచ్చటించడం కనిపించింది.
89ఏళ్ల వయసులో రిటైర్డ్ అధికారి రామదాసు
అంతకుముందు ప్రతిరోజూ ఉదయం 5.55 కి ప్రారంభం కావాల్సిన పాదయాత్ర పొగమంచు కారణంగా ఆలస్యం అయింది. ఉదయం రుద్రారం నుంచి బయలుదేరారు రాహుల్ గాంధీ.. భారత్ జోడో పాదయాత్రలో పాల్గొన్నారు ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శైలజనాథ్.. రాహుల్ గాంధీతో నడిచారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి..శైలజానాథ్.
చిన్నారితో రాహుల్ చిరునవ్వులు
రుద్రారంలో అర్థరాత్రి చిన్నారుల హంగామా
యువతతో అడుగులో అడుగేస్తూ..