బండి బయటకు రావాలంటే అందులో ఇంధనం కావాల్సిందే. హైదరాబాద్ శివారు సంగారెడ్డి జిల్లాలో వాహనదారులను ఒక సమస్య వేధిస్తోంది. టూవీలర్ యజమానులు ఇప్పుడు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడేం పెట్రోల్ ధరలు తగ్గకపోయినా బంకుల యజమానుల మాయాజాలంతో పెట్రోల్ దొరక్క వాహనాలను ఇతర పెట్రోల్ బంకులకు గెంటుకుని వెళ్ళడం కనిపిస్తోంది. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా బంకుల్లో పెట్రోల్ నిండుకుంటోంది. జిల్లాలో ఖాళీ అవుతున్న పెట్రోల్ బంకులతో వాహనదారుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు.
చాలా చోట్ల పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు ఎన్టీవీతో తెలిపారు. ఉదయం సంగారెడ్డి, పటాన్ చెరు, కంది, రుద్రారం, జాతీయ రహదారి వెంట వున్న పెట్రోల్ బంకుల్లో ఇదే పరిస్థితి కనిపించింది. రెండు మూడు రోజుల్లో పెట్రోల్ ధర తగ్గుతుందన్న సమాచారంతో స్టాక్ తెప్పించుకోవడంలేదు పెట్రోల్ బంక్ యజమానులు. టెక్నీకల్ ప్రాబ్లమ్ అని చెబుతున్న బంక్ నిర్వాహకుల తీరుపై మండిపడుతున్నారు వాహనదారులు. సాధారణ పెట్రోల్ స్టాక్ లేదని పవర్ పెట్రోల్ అమ్మేస్తున్నారు.
Read Also:BCCI: బీసీసీఐ చారిత్రాత్మక నిర్ణయం.. పురుషుల క్రికెట్‌లో మహిళా అంపైర్లు
పెట్రోల్ కోసం బంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వాహనదారులు. ఎన్ని బంకులు తిరిగిన పెట్రోల్, డీజిల్ దొరకడం లేదంటున్నారు వాహనదారులు. పెట్రోల్ ధర పెరిగితే కూడా నో స్టాక్ బోర్డులు పెడుతుంటారు బంకుల యజమానులు. ఇప్పుడు రేట్లు తగ్గితే తమ లాభాలు తగ్గుతాయని, నో స్టాక్ బోర్డులతో మాయాజాలానికి పాల్పడుతున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. పవర్ పెట్రోల్ వల్ల వాహనదారులకు అదనపు భారం పడుతుంది. ఈమధ్యే హైదరాబాద్ నగరంలో పెట్రోల్ బంకుల్లో చిప్ లు పెట్టి వాహనదారుల్ని మోసం చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ధరలు తగ్గించడం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Tamannaah: ఎట్టకేలకు పెళ్లి గురించి ఓపెన్ అయిన మిల్కీ బ్యూటీ