సికింద్రాబాద్ రూబీ హోటల్ లో జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటన మరిచిపోకముందే.. ఎక్కడో చోటు అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సికింద్రాబాద్ ఘటనలో 8మంది మరణించిన సంగతి తెలిసిందే. అనేకమంది గాయపడ్డారు. దీనికి కారకులైన వారిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. జహీరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఎలక్షన్ స్ట్రాంగ్ రూమ్ లో అనేక విలువైన పత్రాలు, కంప్యూటర్లు వున్నాయి. ఇక్కడే భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Read Also: Ruby Hotel Fire Accident: ఆ నలుగురిని అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్
ఈ ప్రమాదం కారణంగా ఎన్నికల రికార్డులు.. సామాగ్రి కాలి బూడిదయ్యాయి. మంటలను అదుపు చేశారు అగ్నిమాపక సిబ్బంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు అధికారులు. ఎంత నష్టం సంభవించింది అనేది ఇంకా తేలాల్చి వుంది. అధికారులు ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నారు.
