Snow covered: మంచు దుప్పటి కప్పుకున్న హైదరాబాద్.. మళ్లీ మొదలైన వర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Snow covered: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మళ్లీ వర్షం మొదలైంది. నిన్న రాత్రి నుంచి వాతావరణంలో మార్పుమొదలైంది. దీంతో రాష్ట్రంలో పలు చోట్ల కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ మంచుతో కప్పబడింది. ఇవాళ ఉదయం 5 గంటల నుంచి మంచు కమ్ముకుంది. నగరంలోని అమీర్‌పేట్, పంజాగుట్ట, కూకట్ పల్లి, ఎస్.ఆర్.నగర్,ఎల్బీనగర్, జూబ్లీహిల్స్. బంజారాహిల్స్, దిల్‌సుఖ్‌నగర్, కొండాపూర్, మాధాపూర్‌లలో పొగమంచుతో కూడిన వాతావరణం కలిపించింది. దీంతో నగరవాతావరణం చూస్తుంటే ఊటీని తలపించింది. ప్రయాణికులకు ఇబ్బంది కలిగింది. రోడ్లపై పొగమంచు కమ్ముకోవడంతో.. రాగపోకలకు అంతారయం ఏర్పడింది. కొంతరు ఆమంచు వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేడు ఉదయం జూబ్లీహిల్స్, మణికొండ, సికింద్రాబాద్, కూకట్ పల్లి, లక్డీకపూల్, మెహిదీపట్నంలో భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షం కారణంగా నగర పరిసరాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఉదయం పూట పరిశ్రమలు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం రెండు రోజుల పాటు రాష్ట్రంపై ప్రభావం చూపనుంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్టోబర్ 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.నిన్న సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, మహబూబాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
Read also: Mine Blast in Turkey: టర్కీలోని బొగ్గు గనిలో మీథేన్ పేలుడు.. 25 మంది దుర్మరణం
ఈరోజు కూడా రాష్ట్రంలో వర్ష సూచన ఉంది. కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ములుగు, కరీంగనార్, హన్మకొండ, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
— IMD_Metcentrehyd (@metcentrehyd) October 14, 2022
తాజావార్తలు
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!