సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలో డయాగ్నొస్టిక్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… రెండుకోట్ల యాభై లక్షలు ఒక్కో డయాగ్నోస్టిక్ సెంటర్ కు కేటాయించడం జరిగింది అని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 సెంటర్లను ప్రారంభింఛడం జరిగింది,మరో 16 సెంటర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేయనున్నారు. ఈ వ్యాది నిర్ధారణ కేంద్రాలు పేదలకు ఎంతో ఉపయోగకరం కానున్నాయి. పేదలు పైసా ఖర్చు లేకుండా 57 రకాల వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో త్వరలో రేడియాలజీ…
సంగారెడ్డికి మెడికల్ కాలేజీ ప్రకటించినందుకు చాలా సంతోషమని..ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేసీఆర్ కు కృతజ్ఞతలు అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుండి సంగారెడ్డి మెడికల్ కాలేజీ కోసం తాను పోరాటం చేస్తున్న సంగతి ప్రజలకు తెలుసని.. దాదాపు 10 నియోజకవర్గాల ప్రజలతోపాటు భీదర్ నుండి వచ్చే ప్రజలకు సంగారెడ్డి లో మెడికల్ కాలేజీ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గెలిచిన తర్వాత అసెంబ్లీలో సమయం వచ్చిన ప్రతిసారి మెడికల్ కాలేజ్ ఇవ్వాలని సీఎంను…