Bridegroom escape: వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. పెద్దలు ఒప్పకోకపోవడంతో.. ఇది కాస్త పంచాయతీ పెద్దల వద్దకు వెళ్లింది. దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులు వేరే అబ్బాయితో నిశ్చితార్థం చేశారు.
BJP Nirudyoga march: నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నేడు ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో బీజేపీ శ్రేణులు “నిరుద్యోగ యాత్ర” నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, ఈటల, విజయశాంతి, రఘునందన్ రావు, రాష్ట్ర బీజేపీ నేతలు పాల్గొంటారు.
ఈనెల 11న సంగారెడ్డి పట్టణంలో నిర్వహించే ‘‘నిరుద్యోగ మార్చ్’’ను దిగ్విజయవంతం చేసి సత్తా చాటాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
హైదరాబాద్ నగరం గురించి సూపర్ స్టార్ రజనీకాంగ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు స్పందించారు. హైదరాబాద్ లో ఉన్నాన్నా.. న్యూయార్క్ లో ఉన్నాన్నా.. అని ఇక్కడి అభివృద్ది గురించి ఆయన మాట్లాడారని హరీశ్ రావు అన్నారు.
మన దేశంలో నదులను కూడా దేవతలుగా పూజిస్తారు. అందుకే పన్నెండేళ్ల కోసారి పుష్కరాల పేరుతో ఘనంగా వేడుకలను నిర్వహించి.. నదీమ తల్లిని పూజిస్తారు. పుష్కరాలతో పాటు కుంభమేళాను కూడా నిర్వహిస్తారు. సంగారెడ్డి జిల్లాలో మంజీరా కుంభమేళా సోమవారం ప్రారంభమైంది.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నోటి నుంచి త్వరలో మరో శుభవార్త వింటామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రజలను ఉద్దేశించి అన్నారు. మే 1న మేడే సందర్భంగా కార్మికులకు శుభవార్త ప్రకటిస్తామన్నారు.
కంటి వెలుగు కావాలని ఎవరు చెప్పలేదని, ఓట్ల కోసం ఈ పథకం పెట్టలేదని మంత్రి హరీశ్ రావ్ అన్నారు. సంగారెడ్డి జిల్లాలో తెలంగాణలో కోటి పరీక్షలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సదాశివపేటలో కంటి వెలుగు కార్యక్రమాన్ని మంత్రి హరీష్ రావు పరిశీలించారు.
Jagga Reddy : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి పార్టీ మారుతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. తాజా విషయమేమీ కాదు ఇది రెండేళ్లుగా రాజకీయవర్గాల్లో నానుతున్న సంగతే.
నగర శివార్లలోని జిన్నారం మండలం గడ్డ పోతారంలో పారిశ్రామిక వాడలో ఓ ఫార్మా పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలతో పరిశ్రమ పరిసరాల్లో మంటలు వ్యాపించాయి. భయాందోళనలతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. పరిశ్రమలో మంటలు ఎగిసి పడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.