Telangana VRA: సెప్టెంబర్ 12న శాసన సభలో కేసీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ తో VRA లు ఆందోళన చేపట్టారు. Pay స్కెల్ విధానం లేకుండా ఇస్తున్న జీతం సరిపోవడం లేదని నిరసన వ్యక్తం చేసారు. అయితే.. వీఆర్‌ఏల సమస్యలపై అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో 15 మంది వీఆర్ఏలతో సెప్టెంబర్ 13న కేటీఆర్ భేటీ అయిన విషయం తెలిసిందే. వీఆర్ఏల ప్రతినిధులతో శాసనసభ ప్రాంగణంలో డిమాండ్లపై మంత్రి కేటీఆర్ చర్చలు జరిపారు. అర్హులైన వారికి ప్రమోషన్స్ ఇవ్వాలని వీఆర్‌ఏలు కోరారు. సెప్టెంబర్ 20న మరోసారి చర్చిస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో.. వీఆర్‌ఏలు ఆందోళన విరమించారు.
అయితే ఇచ్చిన హామీల విషయంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో.. నేడు రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ పిలుపుమేరకు మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా వీఆర్‌ఏల నిరసన చేపట్టారు. న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని వీఆర్‌ఏలు నిరసన చేపట్టారు. జిల్లాల్లో కార్యాలయం ముందు వారిడ డిమాండ్లను నెరవేర్చాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Read also: Arya 34: ఆర్య, సిద్ది ఇద్నాని జంటగా సినిమా ప్రారంభం
రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ పిలుపు మేరకు జిల్లాల వారీగా వీఆర్ఏల నిరసనలు:
సంగారెడ్డి జిల్లా పఠాటాన్‌చెరు తహశీల్దార్ కార్యాలయం ముందు VRA ల నిరసన చేపట్టారు. కార్యాలయానికి తాళం తీయకుండా VRAలు అడ్డుకొని నిరసన తెలిపారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
సిద్దిపేట అర్బన్ ఎమ్మార్వో కార్యాలయం గేట్లు మూసివేసి వీఆర్ఏలు ధర్నా చేపట్టారు. ఎమ్మార్వో ఆఫీస్ అధికారులను కార్యాలయంలోకి వెళ్లకుండా వీఆర్ఏలు అడ్డుకున్నారు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం తాహసిల్దార్ కార్యాలయాన్ని వీఆర్‌ఏలు దిగ్బంధం చేశారు. తహశీల్దార్ ఆఫీస్ గేటుకు తాళం వేసి వీఆర్ఏలు నిరసన తెలిపారు. వారి సమస్యలను పరిష్కరించాలనీ 78 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్లను పరిష్కరించాలని నిరసన చేపట్టారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వీఆర్ఏలు ఆందోళన ఉదృతం చేశారు. తహసీల్దార్ కార్యాలయాలకు తాళాలు వేసి వీఆర్ఏలు నిరసన చేపట్టారు. బోధన్, ఆర్మూర్, బాన్స్ వాడా, నిజమాబాద్ లో తహసీల్దార్ గేటు ముందు ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని నిరసన చేపట్టారు.
నిజమాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వీఆర్ఏల ఆందోళన ఉదృతం చేశారు. తహసీల్దార్ కార్యాలయాలకు తాళాలు వేసిన వీఆర్ఏలు నిరసన వ్యక్తం చేశారు. బోధన్, ఆర్మూర్, బాన్స్ వాడా, నిజమాబాద్ లో తహసీల్దార్ గేటు ముందు ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేశారు.
Atchannaidu: డైవర్షన్ పాలిటిక్స్ జగన్ కు అలవాటే