Extreme tension in Jogipet.. Clash between Congress and TRS: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ వేడుకలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. రాజనర్సింహ బర్త్ డే సందర్భంగా జోగిపేట బైపాస్ రోడ్డులో అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీ చేశారు. అయితే ఈ ర్యాలీ తీస్తుండగా టీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలను జెండా కర్రలతో చితకబాదారు. ఈ దాడిపై నిరసన తెలుపుతూ.. టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రోడ్డుపై భైఠాయించి నిరసన తెలిపారు.
Read Also: Zomato: డెలివరీ చేసింది చాలు. ఇక.. ‘‘ఇంటికి వెళ్లండి’’
అయితే ఒకరై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ.. టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డుపై ఆందోళన నిర్వహించారు. పోటాపోటీగా ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. రేపు ఆందోల్ ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు పోస్టర్లు అంటిస్తున్న క్రమంలో.. రాజనర్సింహ బర్త్ డే ర్యాలీ అటువైపుగా వచ్చింది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ పోస్టర్లను చింపేసి, కార్యకర్తలపై దాడి చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఓ టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడి బైకును దగ్ధం చేశారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలాని చేరి మంటలను అదుపులోకి తెచ్చారు.