ఈ ఏడాది ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ వరుస వైఫల్యాలు కొనసాగుతున్నాయి. రన్ మెషిన్‌గా పేరు తెచ్చుకున్న కోహ్లీ ఈ స్థాయిలో తంటాలు పడుతుండటం కెరీర్‌లో బహుశా ఇదే తొలిసారి. దీంతో కోహ్లీ వైఫల్యంపై విమర్శలు వస్తున్నాయి. ఒకరకంగా కోహ్లీ టీమ్‌కు భారంగా మారాడనే చెప్పాలి. ఓపెనర్‌గా వచ్చినా, వన్‌డౌన్‌లో వచ్చినా.. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎక్కడా వచ్చినా కోహ్లీ సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్ అవుతున్నాడు. ఇప్పటి వరకు ఈ ఏడాది ఐపీఎల్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ…
రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు చాహల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 2013 ఐపీఎల్ సీజన్‌లో ఓ ఆర్‌సీబీ ప్లేయర్ తాగిన మైకంలో తనను 15వ అంతస్తు బాల్కనీలో వేలాడదీశాడని తెలిపాడు. ఏ తప్పిదం జరిగినా తాను అక్కడి నుంచి కిందపడి ప్రాణాలు కోల్పేయేవాడినని సంచలన విషయాన్ని బయటపెట్టాడు. అయితే ఆ ప్లేయర్ పేరును చాహల్ వెల్లడించలేదు. తాజాగా చాహల్ వ్యాఖ్యలపై మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. చాహల్ సదరు ఆటగాడి పేరు…
బీసీసీఐ, విరాట్ కోహ్లీ మధ్య వివాదం నడుస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ వివాదంపై తాజాగా టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. సమస్య తలెత్తినప్పుడు కాయిన్‌కు ఒక వైపే చూడొద్దని.. రెండు వైపులా చూడాలని హితవు పలికాడు. సమస్యను చూస్తుంటే ముందుకు వెళ్లలేమని రవిశాస్త్రి స్పష్టం చేశాడు. అలా చూస్తే అద్భుత విజయాలు సాధించలేమని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీతో తాను ఎన్నో ఏళ్లుగా ప్రయాణం చేశానని..…
క్రికెట్ చరిత్రలో మొదటిసారి విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీం ఇండియా 2019-20లో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఆస్ట్రేలియా ను వారి గడ్డపై ఓడించింది. అయితే ఈ నాలుగు టెస్టుల సిరీస్ లోని చివరి మ్యాచ్ లో భారత రెగ్యులర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు బదులుగా కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చి 5 వికెట్ హల్ తో అద్భుతమైన ప్రదర్శన చేసాడు. దాంతో మ్యాచ్ అనంతరం అప్పటి టీం ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి విదేశీ…
2019 వన్డే ప్రపంచ కప్ జట్టులో భారత ఆటగాడు అంబటి రాయుడిని తీసుకొనేందుకు చాలా విమర్శలు వచ్చాయి. టీం ఇండియా సెమీస్ లో ఓడిన తర్వాత రాయుడు ఉంటె గెలిచే వాళ్ళం అని కూడా వార్తలు వచ్చాయి. ఇక తాజాగా భారత మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి ఈ విషయం పై స్పందించారు. జట్టులోకి రాయుడిని ఎందుకు తీసుకోలేదు అనేది తనకు తెలియదు అన్నారు. అయితే ఆ సమయంలో భారత జట్టులో నాలుగో స్థానం పెద్ద…
టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రి పదవీ కాలం ముగిసింది. దీంతో అతడి పనితీరుపై మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ విశ్లేషించాడు. రవిశాస్త్రి కోచ్‌గా ఉన్నంతకాలం క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో టీమిండియాకు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నాడు. రవిశాస్త్రి-విరాట్ కోహ్లీ కాంబినేషన్‌కు తాను 100కు 90 మార్కులు వేస్తానని కపిల్ అన్నాడు. వారిద్దరూ ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు కాబట్టి 10 మార్కులు కట్ చేసినట్లు వివరించాడు. Read Also: కుంబ్లే స్థానంలో ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్…
బ్యాటింగ్‌పై మరింత దృష్టి సారించేందుకు విరాట్ కోహ్లీ ఇతర ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి కూడా వైదొలిగే అవకాశం ఉందని మాజీ కోచ్ రవిశాస్ర్తి తెలిపాడు. కోహ్లీ నేతృత్వంలో భారత జట్టు గత ఐదేళ్లుగా టెస్టుల్లో నెంబర్‌వన్‌గా సాగుతోందన్నాడు. అయితే మానసికంగా అలిసిపోయినట్టు భావించినా.. లేక బ్యాటింగ్‌పై దృష్టి సారించాలనుకున్నా టెస్టు సారథ్యం నుంచి కూడా కోహ్లీ వైదొలగవచ్చు. అయితే అది ఇప్పటికిప్పుడు కాకపోయినా మున్ముందు తప్పదన్నాడు రవిశాస్త్రి. ఇది ఇలా ఉండగా..టీట్వంటీ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ…
వరల్డ్ కప్ టీ20లో భారత్ సెమీస్ దశలోనే నిష్క్రమించిది. అయితే దీనిపై భారత జట్టు కూర్పు సరిగా లేదని అనేక విమర్శలు వెల్లువె త్తుతున్నాయి. పాకిస్తాన్ లాంటి జట్టు పై ఓడిపోవడం సగటు భారతీ య క్రికెట్ అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఐపీఎల్ పైన కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆట గాళ్లను విరా మం లేకుండా క్రికెట్ ఆడించడం భారత జట్టు టీ20 వరల్డ్ కప్‌లో ప్రదర్శన ఆశాజనకంగా లేదని చాలా మంది అభిమానులు…
నిన్నటితో యూఏఈ లో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2021 లో భారత జట్టు ప్రయాణం ముగిసింది. అయితే ఈ ప్రపంచ కప్ ప్రారంభానికి ముందే తాను ఈ టోర్నీ తర్వాత టీం ఇండియా టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుండి తొలిగిపోతానని కోహ్లీ చెప్పిన విషయం తెలిసిందే. దాంతో ఆ తర్వాత కెప్టెన్ ఎవరు అనే దాని పైన చర్చలు మొదలయ్యాయి. అందులో ముఖ్యంగా రోహిత్ శర్మ పేరే ఎక్కువగా వినిపిస్తుంది. ఇక నిన్నటితో టీం…
ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌తో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది. ఇప్పటికే హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ఎంపికయ్యాడు. హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి దిగిపోయిన తర్వాత అతడి భవితవ్యం ఏంటనే విషయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే రవిశాస్త్రి ముందు ఓ బంపర్ ఆఫర్ నిలిచింది. ఐపీఎల్‌లో కొత్త జట్టు అయిన అహ్మదాబాద్ ఫ్రాంచైజీ రవిశాస్త్రిని తమ హెడ్ కోచ్‌గా నియమించుకోవాలని భావిస్తోంది. దీనిపై రవిశాస్త్రిని ఫ్రాంచైజీ యాజమాన్యం సంప్రదించినట్లు సమాచారం. Read…