బ్యాటింగ్‌పై మరింత దృష్టి సారించేందుకు విరాట్ కోహ్లీ ఇతర ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి కూడా వైదొలిగే అవకాశం ఉందని మాజీ కోచ్ రవిశాస్ర్తి తెలిపాడు. కోహ్లీ నేతృత్వంలో భారత జట్టు గత ఐదేళ్లుగా టెస్టుల్లో నెంబర్‌వన్‌గా సాగుతోందన్నాడు. అయితే మానసికంగా అలిసిపోయినట్టు భావించినా.. లేక బ్యాటింగ్‌పై దృష్టి సారించాలనుకున్నా టెస్టు సారథ్యం నుంచి కూడా కోహ్లీ వైదొలగవచ్చు.
అయితే అది ఇప్పటికిప్పుడు కాకపోయినా మున్ముందు తప్పదన్నాడు రవిశాస్త్రి. ఇది ఇలా ఉండగా..టీట్వంటీ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడాన్ని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదీ స్వాగతించాడు. రోహిత్‌కు బాధ్యతలు అప్పగించడం వల్ల కోహ్లీ మరింత కాలం బ్యాటర్‌గా రాణిస్తాడన్నాడు. కోహ్లీ అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీ వదులుకుంటే, ఇంకామంచిదని, తన బ్యాటింగ్‌పై దృష్టిపెట్టేందుకు అవకాశం కలుగుతుందన్నాడు. టీమిండియాకు కోహ్లీ సేవలు చాలా అవసరమన్నాడు.