Ravi Shastri: ఏడాదికి రెండు IPL సీజన్లు.. ద్వైపాక్షిక సిరీసులు వద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ క్రికెట్లో విప్లవాత్మక మార్పులు రావాలని టీమ్‌ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అంటున్నాడు. ద్వైపాక్షిక సిరీసులు ఆడకుండా ఇకనుండి ఏడాదికి రెండుసార్లు IPL నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాడు. ICC T20 ప్రపంచకప్ ఫైనళ్లను తప్ప మిగతా మ్యాచుల్ని ఎవరైనా గుర్తు పెట్టుకుంటున్నారా? అని ప్రశ్నించాడు.
‘ఏడాదికి రెండు IPL సీజన్లే భవిష్యత్తు. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. ఫ్రాంచైజీ క్రికెట్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. రెండు సీజన్లకు 70-70గా విభజించొచ్చు’ అని రవిశాస్త్రి అన్నాడు. ఆటగాళ్లపై ద్వైపాక్షిక సిరీసుల భారం తగ్గించాలని రవిశాస్త్రి చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నాడు. T20 క్రికెట్లో చాలా ద్వైపాక్షిక సిరీసులు జరుగుతున్నాయి. టీమ్‌ఇండియాకు కోచ్‌గా ఉన్నప్పుడూ నేనిదే మాట చెప్పాను. ఇప్పుడూ అదే చెప్తున్నాను. నా కళ్ల ముందరే ఫ్రాంచైజీ క్రికెట్ డెవలప్ అవ్వడం చూస్తున్నాను. క్రికెట్ కచ్చితంగా ఫుట్‌బాల్ బాట పట్టాల్సిందే. T20 క్రికెట్లో కేవలం ప్రపంచకప్ మాత్రమే ఆడాలి. ద్వైపాక్షిక మ్యాచులను ఎవరూ గుర్తు పెట్టుకోరు’ అని ఆయన పేర్కొన్నాడు.
Also Read
- IPL 2027: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ 2027 ముందే స్టార్ ప్లేయర్ అవుట్.. ఇక కష్టమే!
- Smriti Mandhana: 14 ఏళ్ల తర్వాత భారత జట్టుకు కొత్త సారథి.. నేడే ఫుల్ టైమ్ కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంట్రీ..
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
- IND vs WI 4th T20: ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడు.. అతడు జట్టులో ఉండుంటే టీమిండియా గెలిచేది!
టీమ్‌ఇండియా కోచ్‌గా ICC ప్రపంచకప్‌లు తప్పా నాకు ఇంకే మ్యాచులూ గుర్తు లేవు. మెగా టోర్నీని గెలిచిన జట్టే దానిని గుర్తుంచుకుంటాయి. దురదృష్టవశాత్తు మనం గెలవలేదు కాబట్టి మనం గుర్తుంచుకోం. నా ఉద్దేశంలో ప్రతి దేశం సంవత్సరం పొడవునా ఫ్రాంచైజీ క్రికెట్ నిర్వహించాలి. దేశవాళీ క్రికెట్ తరహాలోనే ఇది ఉండాలి. ఆ తర్వాత ప్రతి రెండేళ్లకు ప్రపంచకప్ ఆడాలి’ అని రవిశాస్త్రి వెల్లడించాడు.
- Tags
- bcci
- icc
- ipl
- ravi shastri
తాజావార్తలు
-
Gujarat: పాకిస్థాన్‌కు చెందిన 319 మందికి భారత పౌరసత్వం.. శరణార్థుల కన్నీటి పర్యంతం..
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
Parliament Special Sessions: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ప్లాన్?.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై కసరత్తు
-
IPL 2027: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ 2027 ముందే స్టార్ ప్లేయర్ అవుట్.. ఇక కష్టమే!
-
How to Store Fashion Jewellery: మీ ఫ్యాషన్ జ్యువెలరీ నల్లగా మారుతున్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!