క్రికెట్ చరిత్రలో మొదటిసారి విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీం ఇండియా 2019-20లో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఆస్ట్రేలియా ను వారి గడ్డపై ఓడించింది. అయితే ఈ నాలుగు టెస్టుల సిరీస్ లోని చివరి మ్యాచ్ లో భారత రెగ్యులర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు బదులుగా కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చి 5 వికెట్ హల్ తో అద్భుతమైన ప్రదర్శన చేసాడు. దాంతో మ్యాచ్ అనంతరం అప్పటి టీం ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి విదేశీ పిచ్ ల పై కుల్దీప్ స్పిన్నర్ గా మా మొదటి ఎంపిక అని చెప్పాడు. అయితే ఆ మాటలు తనను బాధపెట్టాయి అని ఈ మధ్య అశ్విన్ ప్రకటించాడు.
అయితే అశ్విన్ కామెంట్స్ పై తాజాగా రవిశాస్త్రి స్పందిస్తూ… అశ్విన్ బాధపడితే నేను హ్యాపీ అన్నారు. ఆ మ్యాచ్ లో అశ్విన్ కు బదులు కుల్దీప్ ను ఆడించడం మంచి నిర్ణయం. నేను తీసుకున్న ఆ నిర్ణయం కారణంగానే అశ్విన్ తన బలహీనతలను సరిచేసుకొని మళ్ళీ జట్టులోకి వచ్చాడు. హెడ్ కోచ్ గా నా పని అందరిని సమానంగా చూస్తూ.. నిజాలు చెప్పడం. అంతేకాని అవతలి వారు బాధపడుతారు అని వెన్నెపూస రాయడం కాదు. నా మాటల వల్ల అశ్విన్ బాధపడితే మంచిదే. ఆ కారణంగా అతను శ్రమించి మళ్ళీ జట్టులోకి వచ్చాడు అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.