Gadikota Srikanth Reddy: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇష్టానుసారం ఆరోపణలు చేయడం, ప్రజల్లో ద్వేషాలు రేపేలా మాట్లాడడం సరైంది కాదని ఆయన మండిపడ్డారు. రాయచోటి అభివృద్ధి గురించి చర్చించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మీరు అధికారులతో కలిసి రండి. నేను ఒక్కడినే వస్తా.. గత ఐదు సంవత్సరాల్లో ఏం చేశానో చూపిస్తా, అని…
ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అధికారికంగా అమలు చేసేందుకు రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో ఏపీ రవాణా శాఖా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. ఆగస్టు 9 న రాఖీ పండుగ సందర్భంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకం ప్రకటన చేయనున్నారు. ఆగష్టు 15 నుంచి అధికారికంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో…
రోడ్డు రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి వైసీపీ పార్టీపై నిప్పులు చెరిగారు. తాజాగా తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు చంద్రబాబు శ్రమిస్తున్నారన్నారు. రోజుకు 18 గంటలు పనిచేస్తూ… రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. సింగపూర్ లాగా అమరావతిని అభివృద్ధి చేస్తామని పదేళ్ల ముందే మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఇందుకు అనుగుణంగా సింగపూర్ ప్రభుత్వ ఆర్కిటెక్ లతో అద్భుతమైన డిజైన్ చేయించారన్నారు. గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం వేల కోట్ల…
త్వరలోనే వైఎస్ జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా సహా అవినీతి చేసిన అందరూ జైలుకు పోతారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గత ఐదేళ్లు రాష్ట్రంలో ఉండే భూములు మొత్తం దోచుకున్నారని, గత ప్రభుత్వ హయాంలో తప్పులు చేసిన పంది కొక్కులన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయని విమర్శించారు. పెద్దిరెడ్డి అడవిని ఆక్రమించుకొని గెస్ట్ హౌస్‌లు కట్టుకున్నారు, రోడ్లు వేసుకున్నారని మండిపడ్డారు. రోజా డైలాగులు సినిమాలో పనికి వస్తాయని, రాజకీయాల్లో కాదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు.…
పేరుకు రాష్ట్ర మంత్రి అయినా… ఆయన్ని ఆ జిల్లాలో పట్టించుకునే వాళ్ళే లేరా? ప్రత్యేకించి తాను ఇన్ఛార్జ్ మినిస్టర్‌గా ఉన్న జిల్లాలో సొంత పార్టీ ఎమ్మెల్యేలే… ఎవరయ్యా నువ్వు అన్నట్టుగా ఉంటున్నారా? ఎమ్మెల్యేల తీరుతో అమాత్యులవారి ఫ్రస్ట్రేషన్ పీక్స్ చేరుతోందా? ఛీ…… డ్యాష్‌లో జీవితం అనుకుంటున్న ఆ మంత్రి ఎవరు? ఎందుకంత దారుణంగా మారిపోయింది పరిస్థితి? చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డిపై ఉమ్మడి జిల్లాలో పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారట. దాన్ని…
రాయచోటి మత సామరస్యానికి ప్రతీక అని చెప్పారు. ఇక్కడి ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారు.. కొందరు అల్లరి మూకలు వల్ల ఇటువంటి సంఘటనలు పునరావృతం అయ్యాయని అన్నారు. ఒక వర్గానికి కానీ, ఒక కులానికి కానీ కొమ్ము కాయకుండా నిజంగా అల్లర్లకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి సూచించారు.