టీడీపీ నేత తిరుపతి వారాధి (77) హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్య జరిగిన రోజు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి ఘటనపై ఆరా తీశారు. నిందితులను వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి పోలీసులను ఆదేశించారు. పోలీసులు ఎట్టకేలకు ఇద్దరూ నిందితులను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. రాయచోటి మత సామరస్యానికి ప్రతీక అని చెప్పారు. ఇక్కడి ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారు.. కొందరు అల్లరి మూకలు వల్ల ఇటువంటి సంఘటనలు పునరావృతం అయ్యాయని అన్నారు. ఒక వర్గానికి కానీ, ఒక కులానికి కానీ కొమ్ము కాయకుండా నిజంగా అల్లర్లకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. ఒక వర్గాన్ని టార్గెట్ చేయడం ఈ ప్రభుత్వం లక్ష్యం కాదని అన్నారు. కొందరు అల్లరి మూకలు చేసిన తప్పిదం వల్ల ఆ ఘటన జరిగింది.. ఈ ఘటన వెనక ఎవరి ప్రోత్సాహం ఉన్న వదలమని హెచ్చరించారు. మత సామరస్యంను చెడగొట్టడం ఎవరివల్ల కాదు.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని మంత్రి పేర్కొన్నారు.
Read Also: Sankranthiki Vasthunam: టీఆర్పీ రేటింగ్స్‌లో “సంక్రాంతికి వస్తున్నాం” సరి కొత్త రికార్టు
మరోవైపు.. రాష్ట్రంలో ఫీజు రీఎంబర్స్మెంట్ ఎక్కువగా పోయేది ఇంజనీరింగ్ కళాశాలలకు అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు తెచ్చిన ఘనత ఆయనదేనని అన్నారు. చంద్రబాబు చొరవ వల్లే ఇంజనీరింగ్ విద్య గ్రామీణ విద్యార్థులకు దగ్గర అయిందని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయో గమనించాలి.. ఇంజనీరింగ్ కాలేజీలు మూత పడేలా చేసింది జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగిన ఎనిమిది నెలల్లో 700 కోట్లు ఇచ్చి ఇంజనీరింగ్ కాలేజీలను ఆదుకున్నామని వెల్లడించారు. మరోవైపు.. గత ప్రభుత్వంలో 50 నుంచి 60 కాలేజీలు మూతపడ్డాయి.. తప్పు చేసింది వాళ్లు, ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. అటువంటి దీక్షలకు ప్రజలు హర్షించరు.. అమెరికాలో కూడా తెలుగువారు శాసించే స్థాయిలో ఉన్నారంటే అది చంద్రబాబు ఘనతేనని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
Read Also: Annamalai: ‘‘మూర్ఖపు స్టాలిన్’’.. ‘‘రూపాయి గుర్తు మార్పు’’పై అన్నామలై ఫైర్..