త్వరలోనే వైఎస్ జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా సహా అవినీతి చేసిన అందరూ జైలుకు పోతారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గత ఐదేళ్లు రాష్ట్రంలో ఉండే భూములు మొత్తం దోచుకున్నారని, గత ప్రభుత్వ హయాంలో తప్పులు చేసిన పంది కొక్కులన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయని విమర్శించారు. పెద్దిరెడ్డి అడవిని ఆక్రమించుకొని గెస్ట్ హౌస్‌లు కట్టుకున్నారు, రోడ్లు వేసుకున్నారని మండిపడ్డారు. రోజా డైలాగులు సినిమాలో పనికి వస్తాయని, రాజకీయాల్లో కాదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు.
చిత్తూరులో మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… ‘త్వరలోనే వైఎస్ జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా సహా అవినీతి చేసిన అందరూ జైలుకు పోతారు. గత ఐదేళ్లు రాష్ట్రంలో ఉండే భూములు మొత్తం దోచుకున్నారని, గత ప్రభుత్వ హయాంలో తప్పులు చేసిన పంది కొక్కులన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. పెద్దిరెడ్డి అడవిని ఆక్రమించుకొని గెస్ట్ హౌస్‌లు కట్టుకున్నారు, రోడ్లు వేసుకున్నారు అటవీ భూఅక్రమ జరిగింది కాబట్టి అందరి మీద కేసులు నమోదు చేశాం. తప్పు చేసిన వారికి వయసుతో సంబంధం ఏం ఉంది?. 60 ఏళ్లు దాటాయి కాబట్టి.. తప్పు చేసినా, అవినీతి చేసినా వదిలేయాలా?. తప్పులు చేశారు కాబట్టే 10 గంటలు, 15 గంటలు కాదు.. ఎన్ని గంటలైనా విచారిస్తారు’ అని అన్నారు.
Also Read: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు!
’75 ఏళ్ల చంద్రబాబు నాయుడుపై ఒక దొంగ కేసు పెట్టి 50 రోజులు జైల్లో పెట్టింది వైసీపీనే కదా?. మేము ఏమీ రోడ్డు మీద పోయో వారిని ఎవరినీ విచారించలేదు. ఆర్కే రోజా డైలాగులు సినిమాలో పనికి వస్తాయి, రాజకీయాల్లో అస్సలు పనికిరావు. సినిమా డైలాగులు చెప్పి చెప్పి రోజా నలబై వేల ఓట్లతో ఓడిపోయింది. మీరు చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందే’ అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ నేతలపై వరుస కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే.