ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అధికారికంగా అమలు చేసేందుకు రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో ఏపీ రవాణా శాఖా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. ఆగస్టు 9 న రాఖీ పండుగ సందర్భంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకం ప్రకటన చేయనున్నారు. ఆగష్టు 15 నుంచి అధికారికంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు మరింత రక్షణగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Also Read:Chris Woakes: జట్టు విజయం కోసం ఇంగ్లాండ్ ప్లేయర్ సాహోసోపేత నిర్ణయం.. కానీ చివరకు!
సూపర్ సిక్స్ సీఎం చంద్రబాబు నాయకత్వం లో అమలు చేయడం జరుగుతోంది. సూపర్ సిక్స్ లో మహిళలకు ఉచిత బస్ సౌకర్యం ఒక హామీ. ఆగస్ట్ 15 న రాష్ట్రంలో మహిళల ఉచిత ఆర్టీసీ ప్రయాణం అమలు అవుతుంది.. ముగ్గురు మంత్రుల తో మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామన్నారు. గత జనవరి లో కర్ణాటక, తెలంగాణ, తమిళ నాడు లో ఉచిత బస్సు ప్రయాణం పై అధికారుల తో కలిసి అధ్యయనం చేసినట్లు వెల్లడించారు. లక్షలాది మంది మహిళలకు మంచి జరుగుతుందన్న కారణంతో ఈ పథకాన్ని తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్రం లో ఎక్కడి నుంచి ఎక్కడికి అయినా ఉచితంగా ప్రయాణించొచ్చు.
Also Read:Vivo Y400 5G: వివో నుంచి వివో Y400 5G మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్.. ప్రీమియం ఫీచర్లు
బస్టాండ్, బస్టాప్ లో ఎలాంటి చర్యలు తీసుకుంటే మహిళలకి సురక్షితం ఉంటుందో ఆ విదమైన సౌకర్యాలు కలిపిస్తాము.. బస్టాండ్ లో కుర్చీలు ఫ్యాన్ లు, పెయింటింగ్స్ అన్ని మరమ్మతులు చేస్తున్నాము.. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ బస్సు లు, ఆర్డినరీ బస్సుల్లో ఈ సదుపాయం కలిపిస్తున్నాము.. త్రిసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం కలిపిస్తున్నాము.. ఎలక్ట్రిసిటీ బస్సు లని సైతం APSRTC లో చేరుస్తాము.. ఆధార్, ఓటర్ ఐడి.. రేషన్ కార్డు ఉపయోగించి ప్రయాణం చెయ్యవచ్చు… బస్సులు పెరిగితే సిబ్బందిని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది..
Also Read:Vivo Y400 5G: వివో నుంచి వివో Y400 5G మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్.. ప్రీమియం ఫీచర్లు
బస్సుల్లో మహిళలకి 65 శాతం సీట్లు కేటాయించటం జరుగుతుంది.. ఈ ఉచిత కేటగిరీ బస్సుల్లో భద్రత కి సంబందించిన అంశాలని పరిశీలిస్తున్నాము.. మహిళా స్టూడెంట్స్, తక్కువ జీతాలు తీసుకుంటున్న మహిళలకి ఇదొక మంచి సౌకర్యం ఉంటుంది.. ట్రాన్సజెండర్స్ కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు.. ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న పెట్టుబడులు రావాలి.. ప్రతి పక్షాలు ఎప్పుడు ఆస్తులు కట్టపెడుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు కానీ.. ఇక్కడ ఎంత మందికి జీవన ఉపాధి కలుగుతుందో అర్ధం చేసుకోవాలని సూచించారు.
Also Read:Dulquer Salmaan : దుల్కర్ తో సినిమా మొదలెట్టిన దసరా నిర్మాత
ఆ బస్సుల్లో ఫ్రీ
పల్లె వెలుగు,అల్ట్రా పల్లె వెలుగు ,ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ లలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు తెలిపారు. 6700 బస్సులు ఈ కేటగిరీ లో ఉన్నాయని వెల్లడించారు.