హర్యానా- పంజాబ్ రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు తమ డిమాండ్లతో ఢిల్లీకి చేరుకుంటున్నారు. అయితే, రైతులను అడ్డుకునేందుకు ఢిల్లీ సరిహద్దులను పోలీసులు మూసివేశారు. అయితే, 2020 రైతు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేష్ టికాయిత్ ఈ ఉద్యమంలో మాత్రం కనిపించడం లేదు.
Brij Bhushan Singh: రెజ్లర్లు గంగలో తమ మెడల్స్ పారేస్తామని చెబుతూ హెచ్చరించిన నేపథ్యంలో దీనిపై భారత రెజర్ల సమాఖ్య(WFI) చీఫ్ బ్రిజ్ శరణ్ సింగ్ స్పందించారు. తనపై వచ్చిన లైంగిక ఆరోపణల్ని కొట్టిపారేశారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ శరణ్ ను పదవి నుంచి తీసేసి, అరెస్ట్ చేయాలని మహిళా రెజ్లర్లు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. తమ డిమాండ్లకు తలొగ్గకపోతే తమ మెడల్స్ గంగా నదిలో విసిరేస్తామని మంగళవారం రెజ్లర్లు హరిద్వార్ వెళ్లారు.
Union minister Ajay mishra Controversial comments on Farmers:కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదం అవుతున్నాయి. తన కార్యకర్తలతో మాట్లాడుతూ.. చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలతో పాటు రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ఆందోళన చేస్తున్న రైతులన్ని కుక్కలతో పోల్చడంతో పాటు.. రైతు నేత రాకేష్ టికాయత్ ను బీ గ్రేడ్ వ్యక్తిగా అభివర్ణించారు.
Rakesh Tikait: మరోసారి భారత కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికాయత్ భారీ ఆందోళనకు సిద్ధం అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో భారీ ఆందోళనలు చేసిన రాకేష్ టికాయత్.. ప్రస్తుతం కేంద్రం తీసుకుచ్చని ఆర్మీ రిక్రూట్మెంట్ స్కీమ్ ‘ అగ్నిపథ్’ఫై ఆందోళనకు సిద్ధం అవుతున్నాడు. ఆగస్టు 7 నుంచి అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేకంగా తమ రైతు సంఘం ప్రచారం ప్రారంభిస్తుందని ఆయన అన్నారు. ఆగస్టు 7న ప్రారంభం అయ్యే…
దేశవ్యాప్తంగా అగ్నిపథ్ స్కీమ్ పై ఆందోళనలు జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. కేంద్రం ప్రభుత్వం నిర్ణయంపై ఆర్మీ ఆశావహుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. కాంగ్రెస్, ఆర్జేడీ, టీఆర్ఎస్ తో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా అగ్నిపథ్ స్కీమ్ పై భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికాయత్ స్పందించారు. కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్…
రాకేష్ టికాయత్ పై జరిగిన దాడిపై ఫైర్ అయ్యారు ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్. ఆయనపై జరిగిన దాడిని ఖండిస్తున్నాని అన్నారు. నిన్న రెడ్డి ఘర్జణ సభలో జరిగిన గొడవల గురించి కూడా స్పందించారు. రెడ్డి సామాజిక వర్గగొడవ, దాడులు ప్రజాస్వామ్యంలో తప్పు అని అన్నారు కేఏ పాల్. పుచ్చలపల్లి సుందరయ్య గారు చివరన రెడ్డిని తీసేశారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో మాటల దాడులు కూడా మానేయాలని హితవు పలికారు. మతాలు, కులాలను వాడుకుని రెచ్చగొడుతున్నారని విమర్శించారు.…
జాతీయ రైతు సంఘం నేత రాకేష్ టికాయత్‌కు షాక్ తగిలింది. బెంగళూరులో జరిగిన రైతు సంఘాల సమావేశంలో ఆయనపై కొందరు వ్యతిరేకులు దాడి చేశారు. అంతేకాకుండా నల్ల సిరా కూడా చల్లారు. రాకేష్ టికాయత్ మీడియాతో మాట్లాడుతుండగా అక్కడికి వచ్చి కుర్చీలు విసిరి కొందరు దాడికి పాల్పడ్డారు. కొంతకాలంగా రాకేష్ టికాయత్ వర్గానికి, చంద్రశేఖర్ వర్గానికి వైరం నడుస్తోంది. దీంతో ఈ రెండు వర్గాల మధ్య భేదాభిప్రాయాలు తారాస్థాయికి చేరాయి. Results: సివిల్స్-2021 ఫలితాలు విడుదల ఈ…
రైతుల సమస్యలపై సుదీర్ఘ పోరాటం చేసి.. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేలా చేసిన భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ)లో చీలిక వచ్చింది. ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన రాకేష్ టికాయత్ వైఖరి నచ్చని రైతు నాయకులు కొత్త సంఘం పెట్టుకున్నారు. రాజేష్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో భారతీయ కిసాన్ యూనియన్ అరాజనీతిక్ పేరుతో కొత్త సంఘంగా ఆవిర్భవించింది. రాజకీయాలకు వ్యతిరేకంగా రైతు సంక్షేమం కోసం పోరాటం చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు రాజేష్ సింగ్ చౌహాన్. ఢిల్లీ రైతు…
తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం దేశ రాజధాని ఢిల్లీలో పోరాటం చేయాల్సి రావడం కేంద్రానికి సిగ్గు చేటు అంటూ ఫైర్ అయ్యారు రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్… వరి కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై యుద్ధం ప్రకటించిన టీఆర్‌ఎస్ సర్కార్.. హస్తిన వేదికగా కేంద్రంపై యుద్ధం ప్రకటించింది.. తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ నిరసన దీక్ష చేపట్టారు.. వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని.. వన్ నేషన్ – వన్ ప్రొక్యూర్‌మెంట్ పాలసీ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు..…