తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం దేశ రాజధాని ఢిల్లీలో పోరాటం చేయాల్సి రావడం కేంద్రానికి సిగ్గు చేటు అంటూ ఫైర్ అయ్యారు రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్… వరి కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై యుద్ధం ప్రకటించిన టీఆర్‌ఎస్ సర్కార్.. హస్తిన వేదికగా కేంద్రంపై యుద్ధం ప్రకటించింది.. తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ నిరసన దీక్ష చేపట్టారు.. వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని.. వన్ నేషన్ – వన్ ప్రొక్యూర్‌మెంట్ పాలసీ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.. ఆ దీక్షలో పాల్గొన్న టికాయత్.. దేశంలో రైతులు ఇంకా మరణిస్తూనే ఉండాలా..? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. రైతుల హక్కుల కోసం పోరాటం సాగుతూనే ఉంటుందని ప్రకటించిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం దేశరాజధాని ఢిల్లీలో పోరాటం చేయటం కేంద్రానికి సిగ్గు చేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: LIVE: ఢిల్లీలో యుద్ధం.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
ధాన్యం కొనుగోలుకు దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలని డిమాండ్ చేశారు రాకేష్ టికాయత్.. కేంద్రం ఏడాదికి 3 విడతలుగా రైతులకు రూ. 6 వేలు ఇస్తోంది. ఏడాదికి రూ. 6 వేలు ఇస్తూ రైతులను ఉద్ధరిస్తున్నట్లు మాట్లాడుతుందని ఎద్దేవా చేశారు.. తెలంగాణ సీఎం కేసీఆర్ రైతుల కోసం చేస్తున్న ఉద్యమానికి మద్దతు ప్రకటించిన ఆయన.. కేసీఆర్ చేస్తున్నది రాజకీయ ఉద్యమం కాదన్నారు.. రైతుల కోసం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఆందోళన చేస్తున్నారు. రైతుల పక్షాన కేసీఆర్ చేస్తున్న ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. సాగు చట్టాల కోసం ఏడాదికి పైగా పోరాటం చేశామని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు రాకేష్ టికాయత్.