ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి తాము మద్దతునివ్వడం లేదని భారతీయ కిసాన్ యూనియన్ (బికేయూ) నేత రాకేష్ తికాయత్ స్పష్టం చేశారు. ఫలానా పార్టీకి మద్దతునిస్తుందన్న వార్తలను ఖండించారు. పరేడ్ గ్రౌండ్‌లో రైతులు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న చింతన్ శివిర్‌లో పాల్గనేందుకు మాగ్ మేళాకు వచ్చిన తికాయిత్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో ఎవ్వరికీ మద్దతు ఇవ్వడంలేదని తెలిపారు. Read Also: ఎమ్మెల్సీగా కవిత ప్రమాణ స్వీకారం రానున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్‌వాద్ పార్టీ-రాష్ట్రీయ…
మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలనే డిమాండ్ తో 15 నెలలుగా రైతులు చేస్తున్న ఆందోళనకు నేటితో ముగుస్తోంది. పోరుబాటను వీడి పొలం బాట పట్టనున్నారు రైతులు. ఢిల్లీలోని సింఘు, తిక్రీ ఘాజీపూర్ సరిహద్దుల్లో గుడారాల్లో ఉంటూ ఆందోళన చేసిన రైతులు పంజాబ్, హర్యానాలోని తమ తమ గ్రామాలకు విజయ యాత్రతో తిరిగి వెళ్తున్నారు. ట్రాక్టర్లపై ఇళ్ళకు వెళ్తున్న రైతులకు స్వాగతం పలికేందుకు హైవేల వెంబడి ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. విజయయాత్ర ను ముందుగా నిన్ననే నిర్వహించాలని…
2021 నవంబర్ 21 నాటి ప్రధాన మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్న అంశాలపై చర్చించేందుకు ఐదుగురు సభ్యుల కమిటీకి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారమూ అందలేదని ఎస్‌కెఎం పేర్కొంది. అటువంటి పరిస్థితిలో భవిష్యత్ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని తెలిపింది. ఈ నెల 7న సింఘూ సరిహద్దు వద్ద ఎస్‌కెఎం సమావేశం అవుతుందని, భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. ఏడాదిగా రైతు ఉద్యమానికి నిరంతరం మద్దతు ఇస్తున్న ఢిల్లీ సరిహద్దుల సమీపంలో నివసిస్తున్న…
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే విపక్షాల ఆందోళనలతో వాయిదాల పర్వానికి తెరలేపింది.. మరోవైపు.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని.. వ్యసాయ చట్టాలను తీసుకొచ్చిన నరేంద్ర మోడీ సర్కార్.. ఆ బిల్లులను రద్దు చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించగా.. ఇవాళ వ్యవసాయ సాగు చట్టాల రద్దు బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టడం.. మూజువాణి ఓటుతో ఆమోదం పొందడం జరిగిపోయాయి.. ఇక, లోక్ సభలో వ్యవసాయ చట్టాల రద్దు ఆమోదంపై స్పందించారు బీకేయూ నేత రాకేష్ టికాయత్… లోక్‌సభ ఆమోదించిన…
కేంద్రం కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాల్సిందే.. లేకపోతే ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు సంయుక్త కిసాన్ మెర్చా నేత రాకేష్ టికాయత్.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు చేస్తున్న ఆందోళన ఏడాది దాటింది.. ఇక, ఆ వివాదాస్పద చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ.. రైతులకు క్షమాపణలు కూడా చెప్పారు.. అయితే, కనీస మద్దతు ధర చట్టం తెచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని రైతు సంఘాలు చెబుతున్నాయి..…
రైతులు ఉద్యమానికి ఏడాది పూర్తి కానున్న సందర్భంగా అఖిల భారత రైతు పోరాట సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మహా ధర్నాకు ముఖ్య అతిథిగా కిసాన్ సంయుక్త మోర్చా నాయకుడు రాకేష్ టికాయత్‌తో పాటు ఉత్తారాది రైతు సంఘాల నేతలు ఈ మహాధర్నాకు హాజరయ్యారు.ఈ సందర్భంగా టికాయత్ మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. భాష వేరు కావొచ్చు రైతులందరి లక్ష్యం ఒక్కటేనన్నారు. రైతుల సంఘాలు అడిగిన ప్రశ్నలకు ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదన్నారు. కేంద్రాన్ని…
రైతు ఉద్యమాన్ని రగిల్చిన వ్యక్తి. సాగు చట్టాల వ్యతిరేక పోరాటంలో ముందున్న వ్యక్తి. ఆయనే రాకేష్ టికాయత్. ఇకపైన రైతుల సమస్యల పోరాటం కొనసాగుతుందని.. విశ్రమించ బోమంటున్నా రాయన. రైతు ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ఎవరు అంటే అందరికి గుర్తుకొచ్చే పేరు రాకేష్ టికాయత్. భారత కిసాన్ యూనియన్ నేత. రైతులకు శాపంగా మారిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. అన్నదాతలు నడిపిన ఆందోళనలకు నాయకత్వం వహించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా…
కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయసాగు చట్టాలకు వ్యతిరేకంగా గత 11 నెలలుగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దేశరాజధాని ఢీల్లీ సరిహద్దు ప్రాంతాల్లో టెంట్లు వేసుకొని రోడ్లను దిగ్భంధించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కేంద్రం ఏమాత్రం వెనక్కి తగ్గ కుండా పార్లమెంట్‌లో బిల్లు ఆమోదించింది. ఈ బిల్లులో 1.నిత్యవసర సరకుల(సవరణ) బిల్లు (ది ఎసెన్షియల్ కమోడిటీస్ (అమెం డమెంట్) బిల్ 2020), 2. రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రోత్సాహక, సులభతర) బిల్లు’…
ఉత్తరప్రదేశ్ లో జరిగిన లఖింపూర్ ఘటన దేశవ్యాపితంగా పెను దుమారమే లేపింది… యోగి సర్కార్ నుంచి మోడీ సర్కార్ వరకు.. అందరిపై విమర్శలు, ఆరోపణలు పెరిగి పోయాయి.. సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంటే తప్ప.. విచారణ ముందుకు సగలేదని విపక్షాలు మండిపడుతున్నాయి.. అయితే ఈ కేసులో దర్యాప్తు పట్ల భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ టికాయత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాపై సెక్షన్ 120బి కింద కేసు నమోదు చేయాలి.…
హర్యానాలో రైతులు..భద్రతా సిబ్బంది మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది, జజ్జర్‌లో ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా కార్యక్రమానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. రైతులను ఆపడానికి నీటి ఫిరంగులను ప్రయోగించారు పోలీసులు. అయితే… నల్ల జెండాలతో రైతులు ముందుకే సాగిపోయారు. ఈ సందర్భంగా పోలీసులు-రైతుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వ వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల దగ్గర నెలల తరబడి రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక..ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు తమ విధులకు…