Rakesh Tikait: భారతదేశంలో జరిగిన రైతు ఉద్యమంపై సోషల్ మీడియా సంస్థలైన ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో తగినంత ప్రచారం జరగలేదని రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్ పేర్కొన్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమం సందర్భంగా భారత ప్రభుత్వం తమపై ఒత్తిడి తీసుకొచ్చినట్టు ట్విట్టర్ సంస్థ మాజీ సీఈవో జాక్ డార్సీ చెప్పిన విషయం వాస్తవమే అయి ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు ఉద్యమాన్ని ఎలా అణగదొక్కాలో అంతకంటే ఎక్కువగానే ఆ ప్రయత్నం చేసిందన్నారు.
Read also: JNTU: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ట్రాన్స్‌ఫర్లకు జేఎన్‌టీయూ అనుమతి!
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేపట్టిన సమయంలో భారత ప్రభుత్వం తమపై వత్తిడి తెచ్చినట్లు ట్విట్టర్ సంస్థ మాజీ సీఈవో జాక్ డార్సీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై రైతు ఉద్యమ నేత రాకేశ్ టికాయత్ స్పందించారు. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో రైతు ఉద్యమం గురించి ఎక్కువ ప్రచారం జరగలేదన్నారు. ఆశించిన స్థాయిలో సమాచార వ్యాప్తి జరగలేదన్నారు. సర్కార్ తమ స్థాయిలో రైతు ఉద్యమాన్ని అడ్డుకున్నట్లు టికాయత్ తెలిపారు. దీనిపై మాజీ సీఈవో జాక్ డార్సీ స్పష్టంగా చెప్పారని టికాయత్ గుర్తు చేశారు. కేంద్రం ఒత్తిడి తెచ్చినా అలాంటి కంపెనీలు ఎటువంటి వత్తిళ్లకు లోనుకావన్నారు. బహుశా ప్రభుత్వం ట్విట్టర్ సంస్థను బెదిరించి ఉంటుందని.. డార్సీ చెప్పింది నిజమే అయి ఉంటుందని టికాయత్ అన్నారు.
Read also: Tamil Nadu Politics: బీజేపీ, అన్నాడీఎంకేల మధ్య దోస్తాన్ కటీఫ్..!
అంతకుముందు భారత ప్రభుత్వం తమపై వత్తిడి తెచ్చినట్లు ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డార్సీ ఆరోపించారి.. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేస్తున్న సమయంలో కొందరి అకౌంట్లను బ్లాక్ చేయాలని కోరుతూ భారత సర్కార్ తమపై వత్తిడి తెచ్చినట్లు డార్సీ పేర్కొన్నారని చెప్పారు. యూట్యూబ్ ఛానల్ బ్రేకింగ్ పాయింట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాక్ ఈ వ్యాఖ్యలు చేశారని టికాయత్ గుర్తు చేశారు. విదేశీ ప్రభుత్వాల నుంచి ఏవైనా వత్తిళ్లు వచ్చాయా అని ప్రశ్న డార్సీ ఇండియా గురించి ప్రస్తావించారని తెలిపారు. రైతుల నిరసన ప్రదర్శన సమయంలో తమకు ప్రభుత్వం నుంచి చాలా అభ్యర్థనలు వచ్చాయని, గవర్నమెంట్ పట్ల వ్యతిరేకంగా ఉన్న జర్నలిస్టులను నియంత్రించేందుకు ప్రయత్నించారని, లేదంటే ట్విట్టర్‌ను మూసివేస్తామని బెదిరించాని జాక్ డార్సీ తన ఇంటర్వ్యూలో వెల్లడించారు. తమ ఉద్యోగుల ఇండ్లను కూడా తనిఖీ చేస్తారని చెప్పారని.. ఒకవేళ తమ ఆదేశాలు పాటించకుంటే ఇండియాలో ఉన్న ఆఫీసులను మూసివేస్తామని కూడా హెచ్చరించినట్లు డార్సీ తెలిపారని చెప్పారు. ప్రజాస్వామ్య భారత దేశంలో ఇలాంటి వ్యవహారాలు నడుస్తున్నట్లు మాజీ సీఈవో ఆరోపించారని టికాయత్ గుర్తు చేశారు.